రంగస్థలం: సుక్కూ మార్కు... ఊర మాసు!

రంగస్థలం: సుక్కూ మార్కు... ఊర మాసు!

సుకుమార్‌ సినిమా ఏమిటి, మాస్‌గా వుండడమేంటి అని ఎవరైనా ఆశ్చర్యపోతారు. తెలివైన, క్లాస్‌ టచ్‌తో కూడిన సినిమాలు తీసే సుకుమార్‌ ఇంతవరకు ఊర మాస్‌ అనిపించే సినిమా ఒక్కటీ చేయలేదు. అతను తీసిన వాటిలో ఆర్య ఒక్కదాంట్లోనే కాస్త కమర్షియల్‌ టచ్‌ వుంటుంది కానీ మిగతా అన్ని సినిమాలు రొటీన్‌కి భిన్నంగా సాగుతాయి.

ఇంతవరకు మాస్‌ కథల జోలికి పోని సుకుమార్‌ 'రంగస్థలం'లో మాత్రం మాస్‌ స్టయిల్‌ చూపిస్తున్నాడట. చరణ్‌ని తనదైన శైలిలో కొత్తగా చూపించడంతో పాటు అతనికి వున్న మాస్‌ ఇమేజ్‌ని కూడా సుకుమార్‌ దృష్టిలో పెట్టుకున్నాడట. ఎన్టీఆర్‌తో తీసిన 'నాన్నకు ప్రేమతో' చిత్రం ప్రశంసలు అందుకున్నా కానీ కమర్షియల్‌గా వర్కవుట్‌ కాలేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆ చిత్రం విజయవంతం కాలేకపోయింది. తన సినిమాలు మాస్‌కి రీచ్‌ కావడం లేదని గుర్తించిన సుకుమార్‌ 'రంగస్థలం'లో మాస్‌ ఎలిమెంట్స్‌ బాగా జోడించాడట.

చరణ్‌ క్యారెక్టరైజేషన్‌, బాడీ లాంగ్వేజ్‌, హీరో ఎలివేషన్‌ సీన్స్‌ మాస్‌ని ఉర్రూతలూగించేలా వుంటాయని, అలాగే సుకుమార్‌ సినిమా నుంచి ఆశించే అంశాలన్నీ ఇందులోను జోడించారని విశ్వసనీయంగా తెలిసింది. ఈ చిత్రం తర్వాత మళ్లీ కుర్రాళ్లు గడ్డాలు పెంచి, లుంగీలతో తిరిగే ట్రెండు పల్లెల్లో వచ్చేస్తుందని కూడా చిత్ర వర్గాలు అంటున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు