ఇష్ట‌మైన హీరోలు: క‌ల్యాణ్‌.. చిరంజీవి.. మ‌హేశ్

ఇష్ట‌మైన హీరోలు: క‌ల్యాణ్‌.. చిరంజీవి.. మ‌హేశ్

కాలం మారింది. ప‌రిస్థితులు మారిపోయాయి. చిత్ర ప్ర‌చారానికి ఇప్పుడున‌న్ని దారులెన్నో. సినిమా మీద అంచ‌నాలు పెంచ‌టానికి వ‌చ్చిన మాధ్య‌మాల‌తో సినిమా ప్ర‌మోష‌న్ కొత్త పుంత‌లు తొక్కుతోంది. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఎవ‌రి రిక్వెస్ట్ అవ‌స‌రం లేకుండా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసుకునే అవ‌కాశం ద‌క్కుతుంది. తాజాగా అలాంటి స‌దుపాయాన్ని ఉప‌యోగించుకొని మ‌ర‌క‌త‌మ‌ణి చిత్ర హీరోయిన్ నిక్కీ గ‌ల్రానీ ముద్దుముద్దుగా చాలా మాట‌ల్నే చెప్పింది. తాజాగా ఫేస్ బుక్ లైవ్ లో అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చెప్పిన స‌మాధానాల‌తో అంద‌రి మ‌న‌సుల్ని దోచేసింది.

ఆమె చెప్పిన కొన్ని స‌మాధానాల్ని చూస్తే..

+ ప‌వ‌ర్ స్టార్ గురించి ఏం చెప్ప‌ను. ఆయ‌న పేరులోనే ప‌వ‌ర్ ఉంది. కొత్త‌గా నేనేం చెప్ప‌ను

+ మ‌హేశ్ బాబు గురించి.. స‌ర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయ‌న సినిమాలు ఎంచుకునే తీరు న‌చ్చుతుంది

+ ప్ర‌భాస్ బాహుబ‌లి చూశా.. చాలా అద్భుతంగా ఉంది. ప్ర‌భాస్‌.. రాజ‌మౌళి స‌ర్ తో సినిమా చేయాల‌ని ఎవ‌రు అనుకోరు?

+ తెలుగు సినిమాలో యాక్ట్ చేస్తారా? అని అడుగుతున్నారు. నాకూ చేయాల‌ని ఉంది. ఆశ తీరుతుంద‌నుకుంటున్నా.

+  ఆదితో ఇది రెండో సినిమా. మ‌ర‌త‌క‌మ‌ణి చేస్తున్నంత‌సేపు చాలా ఎంజాయ్ చేశా

+ ఇప్పుడు త‌మిళంలో ఐదు సినిమాలు చేస్తున్నా.

+  తెలుగు వ‌చ్చు. కానీ.. ప‌ర్ ఫెక్ట్ గా రాదండి.

+ ఆది చాలా స‌ర‌దా వ్య‌క్తి.. ఆయ‌నతో క‌లిసి ప‌ని చేయ‌టం బాగుంటుంది.

+ తెలుగులో ఇష్ట‌మైన హీరోలు చాలామందే ఉన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. చిరంజీవి.. మ‌హేశ్ బాబు ఇలా చాలామంది.

+ సినిమాలు కాకుండా ఇష్ట‌మైన‌దంటే.. నాకు కుక్క‌లంటే ఇష్టం. ఏ మాత్రం ఖాళీ దొరికినా వాటితో ఆడుకుంటా.

+ స‌గ‌టు అమ్మాయిలానే ఉంటా. నా లైఫ్ చాలా సింఫుల్ గా ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు