ఆ ఇద్దరూ... ఏకుతారు, పీకుతారు!

ఆ ఇద్దరూ... ఏకుతారు, పీకుతారు!

ధన్ రాజ్, తాగుబోతు రమేష్. - ఈ ఇద్దరూ లేని సినిమాలు ఇటీవల కాలంలో అరుదేమో. రాజమౌళి, త్రివిక్రమ్ దగ్గర్నుంచి చిన్న చిన్న దర్శకులు రూపొందిస్తున్న సినిమాల వరకు అన్నిచోట్లా  వీళ్ళే కనిపిస్తున్నారు. తెరపై తమదైన శైలిలో నవ్వులు పంచుతున్నారు. ఒకరకంగా తెలుగు సినిమా కామెడీని కొత్త పుంతలు తొక్కించిన చిచ్చర పిడుగులు వీళ్ళు. ఈ గ్యాంగ్ ధాటికి నిన్నటితరం కామెడీ బృందం అంతా మూలన పడిందంటే అతిశయోక్తికాదు. తాజాగా ఈ కామెడీ ద్వయం హీరోలుగా కూడా ప్రమోషన్ పొందారు. నవ్వులతో ఏకుతాం, కలెక్షన్లు పీకుతాం అంటూ  ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

ధన రాజ్, తాగుబోతు రమేష్ కథానాయకులుగా `ఎ.కె.రావు... పి.కె.రావు` అనే సినిమా తెరకెక్కబోతోంది. ఓ కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రారంభం కాబోతోంది. పలువురు సినిమా ప్రముఖులు ఈ ఓపెనింగ్ కి హాజరు కాబోతున్నారు. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ సినిమా సాగుతుందనీ, ఏకే రావుగా పీకే రావుగా రమేష్, ధన్ రాజ్ అలరించబోతున్నారనీ చిత్ర బృందం చెబుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు