గౌతమిపుత్ర హ్యాంగోవర్‌లో ఇలా దొరికేసాడు

గౌతమిపుత్ర హ్యాంగోవర్‌లో ఇలా దొరికేసాడు

'గౌతమిపుత్ర శాతకర్ణి'తో పీరియాడికల్‌ మూవీ తీసి ప్రశంసలు అందుకున్న దర్శకుడు క్రిష్‌ ఆ తర్వాత ఏం చేయాలనే దానిపై ఆలోచనలో వుండగా, కంగనా రనౌత్‌ ప్లాన్‌ చేసిన 'మణికర్నిక' చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఝాన్సీ లక్ష్మిభాయ్‌ జీవిత కథతో రూపొందుతోన్న ఈ చిత్రం కూడా 'గౌతమిపుత్ర శాతకర్ణి' జోనర్‌కే చెందినది కావడంతో, ఆ గ్లోరీని ఎంజాయ్‌ చేస్తోన్న క్రిష్‌ వెంటనే ఓకే చెప్పేసాడు. అయితే అప్పటికే ఈ ప్రాజెక్ట్‌ వివిధ వివాదాలకి తెర లేపింది.

ముఖ్యంగా దీని కోసం ఎన్నో ఏళ్ల పాటు రీసెర్చ్‌ చేసిన కేతన్‌ మెహతా ఈ చిత్రాన్ని కోర్టుకి లాగాడు. తన రీసెర్చ్‌ని, తను రాసుకున్న స్క్రీన్‌ప్లేని కంగన కాపీ కొట్టిందని అతను ఆరోపించాడు. దీంతో మణికర్నిక లీగల్‌ ట్రబుల్‌లో ఇరుక్కుంది. ఇప్పటికే షూటింగ్‌ మొదలు కావాల్సిన ఈ చిత్రాన్ని మొదలు పెట్టడానికి జంకుతున్నారు. షూటింగ్‌ చేసిన తర్వాత దీనికి కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే కోట్లు నష్టపోవాల్సి వస్తుందని భయపడుతున్నారు.

మరోవైపు ఇదే సబ్జెక్ట్‌తో మరో రెండు చిత్రాలు సెట్స్‌ మీదకి వెళుతున్నాయి. తెలుగులో తన ఆలోచనలకి రూపమివ్వడానికి ఇష్టపడే క్రిష్‌ హిందీ చిత్ర సీమలో మాత్రం వెరైటీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మొదట 'ఠాగూర్‌' రీమేక్‌ చేసిన క్రిష్‌ ఇప్పుడు వేరే దర్శకుడు రెడీ చేసిన సబ్జెక్ట్‌ని తీసుకుని దర్శకత్వానికి సై అనేసి చిక్కుకుపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు