ప్రభాస్‌తో కాలేదు.. బన్నీతో అవుతుందా?

ప్రభాస్‌తో కాలేదు.. బన్నీతో అవుతుందా?

రష్మిక మండన్నా. గత ఏడాది కన్నడలో సంచలన విజయం సాధించిన ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాతో కథానాయికగా పరిచయమై తొలి సినిమాతోనే స్టార్ ఇమేజ్ సంపాదించిన అమ్మాయి. ‘కిరిక్ పార్టీ’ సూపర్ డూపర్ హిట్ కావడంతో కన్నడ నుంచే కాక పొరుగు ఇండస్ట్రీల నుంచి కూడా అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగులో ఆల్రెడీ ఆమె నాగశౌర్య సరసన ఓ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఆ సినిమా ఒప్పుకున్న సమయంలోనే ప్రభాస్ మూవీ ‘సాహో’ కోసం ఆమెను పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. దాదాపు హీరోయిన్‌గా ఫైనలైజ్ అయినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. కానీ తర్వాత ఏమైందో ఏమో కానీ.. రష్మిక రేసు నుంచి తప్పుకుంది.

ఐతే ప్రభాస్‌తో ఛాన్స్ మిస్సయినప్పటికీ.. టాలీవుడ్లో మరో బంపరాఫర్ ఆమె తలుపు తట్టినట్లు చెబుతున్నారు. అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య-నా ఇల్లు ఇండియా’లో రష్మిక కథానాయికగా నటించే అవకాశాలున్నాయట. ఫ్రెష్ ఫేస్ కోసం చూస్తున్న బన్నీ-వక్కంతం వంశీ.. రష్మికకే ఓటేసినట్లు సమాచారం. అందానికి అందం.. నటనకు నటన రెండూ ఉన్న ఈ అమ్మాయి అయితే కథానాయికగా బాగుంటుందని వాళ్లు భావిస్తున్నారట.

సినీ అరంగేట్రానికి ముందు రష్మిక మోడల్‌గా పని చేసింది. కొన్ని ప్రకటనల ద్వారా మన జనాలకూ ఈ అమ్మాయి పరిచయమే. తొలి సినిమా తర్వాత తన వ్యక్తిగత విషయాలతోనూ రష్మిక మీడియాలో హైలైట్ అవుతూ వస్తోంది. ‘కిరిక్ పార్టీ’ దర్శకుడు రక్షిత్‌తో ఆమె ప్రేమాయణం సాగిస్తోంది. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది కూడా. వాళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు