చైతూ-సమంత కాంబో.. షరతులు వర్తించును

చైతూ-సమంత కాంబో.. షరతులు వర్తించును

అక్కినేని నాగచైతన్య-సమంత రూత్ ప్రభుల కాంబినేషన్ అనగానే తెలుగు ప్రేక్షకులకు ఒక రకమైన పులకరింత కలుగుతుంది. చైతూ-సమంత కాంబినేషన్లో తొలిసారి వచ్చిన ‘ఏమాయ చేసావె’ వాళ్లిద్దరికే కాదు.. తెలుగు ప్రేక్షకులకూ ఓ మధుర జ్నాపకమే.

అలాగే వీళ్లిద్దరూ కలిసి చివరగా చేసిన ‘మనం’ కూడా ఓ మరపు రాని సినిమానే. మళ్లీ వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడూ నటిస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కోసం ముందు సమంతనే అనుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ తర్వాత రకుల్ లైన్లోకి వచ్చింది. ఐతే చైతూ.. ఇప్పుడు మళ్లీ సమంత ఊసెత్తుతున్నాడు. ఆమెతో కలిసి నటిస్తానంటున్నాడు. కానీ ఇక్కడ అతనో షరతు పెడుతున్నాడు.

సమంతతో చైతూ చేయబోయేది తెలుగు సినిమా కాదట. తమిళ చిత్రమట. ఈ మధ్య చాలామంది టాలీవుడ్ హీరోలు పొరుగు మార్కెట్లపై కన్నేస్తున్నారు. ద్విభాషా చిత్రాలు చేస్తున్నారు. చైతూకు ఎప్పట్నుంచో తమిళ మార్కెట్ పై దృష్టి ఉంది. ఈ ఏడాదే గౌతమ్ మీనన్ నిర్మాణంలో యువ దర్శకుడు కార్తీక్ నరేన్ డైరెక్షన్లో ఓ సినిమా చేయాల్సింది.

కానీ కొన్ని కారణాల వల్ల అందులోంచి తప్పుకున్నాడు. ఐతే ఇప్పుడు మరో తమిళ సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయట. తాను తమిళంలో ఎప్పుడు అరంగేట్రం చేసినా అందులో సమంతనే కథానాయిక అని చైతూ చెబుతుండటం విశేషం.

తమిళంలో సమంతకు మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ ఆమె స్టార్ హీరోయిన్. సమంత అరంగేట్రం చేసిందే తమిళంలో. అక్కడ విజయ్, సూర్య లాంటి స్టార్ హీరోలతో ఆమె నటించింది. కాబట్టి సమంత సాయంతో కోలీవుడ్‌ను కొల్లగొట్టేయాలని చైతూ ప్లాన్ చేస్తున్నట్లుగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు