ఆ ఇద్ద‌రిని ట‌చ్ చేయాలంటే...రూ.2 కోట్లు ఉండాల్సిందే !

ఆ ఇద్ద‌రిని ట‌చ్ చేయాలంటే...రూ.2 కోట్లు ఉండాల్సిందే !

తెలుగు సినీ ఇండ‌స్ర్టీలో ఇద్ద‌రు హీరోయిన్ల‌కు వ‌య‌సు ముదురుతున్నా ఏమాత్రం డిమాండు త‌గ్గడం లేదు.. వారు కావాలంటే, అదేనండీ వారిని హీరోయిన్ గా పెట్టి సినిమా తీయాలంటే నిర్మాత‌లు త‌క్కువ‌లో త‌క్కువ రూ.2 కోట్లు కేవ‌లం వారి రెమ్యూన‌రేష‌న్ కోస‌మే కేటాయించాల‌ట‌. ఆ మాత్రం లేనిదే వారి డేట్లు దొరికే చాన్సే లేదు. అంత ఇచ్చుకోలేం అనుకునేవారు మిగ‌తా హీరోయిన్ల వైపు చూడాల్సిందే.  ఇంత‌కీ ఆ ఇద్ద‌రూ ఎవ‌రో తెలుసా...? ఇంకెవ‌రు అందాల బొద్దు గుమ్మ‌లు అనుష్క‌, న‌య‌న‌తార‌. అందంలో, అభిన‌యంలో త‌మ‌కెవ‌రూ సాటి లేరంటూ ఇద్ద‌రికి ఇద్ద‌రూ సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ మ‌రింత అందంగా త‌యార‌వుతున్నారు. దీంతో టాప్ హీరోలు అంద‌రి క‌ళ్లూ వారిపైనే ఉంటున్నాయ‌ట‌.

తెలుగు, త‌మిళం, మ‌ళ‌యాల ఇండ‌స్ర్టీల్లో త‌న న‌ట‌నా కౌశ‌లాన్ని చూపిన న‌య‌న తారకు అన్ని చోట్లా మంచి డిమాండు ఉంది. తెలుగులో ల‌క్ష్మీ, చంద్ర‌ముఖి, తుల‌సి, అదుర్స్‌, దుబాయ్ శీను, సింహా, బాస్ , రామ‌రాజ్యం వంటి హిట్ చిత్రాల్లో యాక్ట్ చేసిన ఈ వ‌య్యారి సినిమాకు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ‌ర‌కు అడుగుతోంద‌ట‌.

ఇక మ‌రో సుంద‌రాంగి,  బాహుబ‌లి భామ అనుష్కదీ అంతే రేంజ్‌. అరుంధ‌తి, చింత‌కాయ‌ల ర‌వి, బిల్లా, వేదం, విక్ర‌మార్కుడు, ల‌క్ష్యం, సింగం వంటి తెలుగు సినిమాల్లో న‌టించిన  ఈమెకు తమిళంలోనూ మంచి క్రేజ్ ఉంది. యోగా ప్రాక్టీస్ ఉన్న ఫిజిక్ కావ‌డం, మంచి న‌ట‌నా సామ‌ర్థ్యం ఉండ‌డం, అందం తోడ‌వ‌డంతో అనుష్క‌కు ఎప్పుడూ డిమాండు ఉంటోంది. దీంతో ఈమె ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వ‌ర‌కు అడుగుతోంద‌ట‌.

 ఇక మిగ‌తా సీనియ‌ర్ తెలుగు హీరోయిన్ల‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా రూ.1.75 కోట్లు... శ్రీయ రూ.1.5 కోట్లు, కాజ‌ల్ రూ.1.2 కోట్లుకు ఏమాత్రం త‌గ్గ‌డం లేద‌ట‌.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు