ఫ్లాప్‌ అయినా ఆమెకే అతని ఓటు

ఫ్లాప్‌ అయినా ఆమెకే అతని ఓటు

హాలీవుడ్‌లో ఎన్నో ఆశలతో అడుగు పెట్టిన దీపిక పడుకొనేకి మొదటి ప్రయత్నం కలిసి రాలేదు. 'ఎక్స్‌ఎక్స్‌ఎక్స్‌' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ అవడంతో హాలీవుడ్‌లో సెన్సేషనల్‌ స్టార్ట్‌ దొరుకుతుందని ఆశించిన దీపికకి చుక్కెదురైంది. ఈ సినిమా ప్రమోషన్లు, హాలీవుడ్‌లో తన బ్రాండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ కోసం దీపిక పెట్టిన ఖర్చులే దీనికి వచ్చిన పారితోషికం కంటే ఎక్కువ అయి వుంటాయి.

హాలీవుడ్‌ నటుడు విన్‌ డీజిల్‌తో సన్నిహితంగా మెలిగిన దీపికకి ఆ స్నేహం ఇప్పుడు కలిసి వచ్చింది. ఎందుకంటే ఆ చిత్రం సీక్వెల్‌లోను దీపిక హీరోయిన్‌గా ఎంపికైంది. ఆ సంగతి సదరు చిత్ర దర్శకుడే ఖరారు చేసాడు. దీపిక మత్తులో పడిపోయిన కండల వీరుడు విన్‌ డీజిల్‌ ఆమెని సీక్వెల్‌లోను కంటిన్యూ చేయాల్సిందేనని పట్టుబట్టాడట.

డీజిల్‌ లేనిదే ఈ ఫ్రాంచైజీ ముందుకెళ్లదు కనుక అతని ఇష్ట ప్రకారం దీపికకే అవకాశం ఇచ్చేసారట. మరి ఈ సినిమాతో అయినా దీపిక కోరుకుంటోన్న భారీ విజయంతో హాలీవుడ్‌లో పర్మినెంట్‌ స్థానం దక్కుతుందా లేక విన్‌ డీజిల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి మాత్రం పనికి వస్తుందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు