రజనీకాంత్‌ని అమ్మేసుకుంటున్నారా?

రజనీకాంత్‌ని అమ్మేసుకుంటున్నారా?

'రోబో' సీక్వెల్‌ '2.0' హిందీ వెర్షన్‌కి ఎనభై కోట్ల ధర పలికిందని గొప్పగా చెబుతున్నారు. ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి ఇది పెద్ద అఛీవ్‌మెంటే కానీ ఇందులో వున్న అక్షయ్‌కుమార్‌ని మర్చిపోకూడదు. బాహుబలి 2 సాధించిన విజయంతో 2.0కి ఈ స్థాయి ఆఫర్‌ ఇచ్చారనేది సుస్పష్టం.

అయితే బాహుబలి 2 హిందీలో ఎంత వసూలు చేసిందనేది కూడా గుర్తుంచుకోవాలి. హిందీలో ఇంతవరకు ఏ సినిమా సాధించని ఫీట్లు కేవలం అనువాద వెర్షన్‌తోనే బాహుబలి సాధించింది. లక్కీగా హిందీ వెర్షన్‌ రైట్స్‌ అమ్మేయకుండా అడ్వాన్స్‌ పద్ధతిలో రిలీజ్‌ చేసుకోవడం వల్ల హిందీలో వచ్చిన లాభాలన్నీ నిర్మాతల జేబుల్లోకే వెళుతున్నాయి. కేవలం హిందీ వెర్షన్‌తోనే బాహుబలి ఇండియాలో రెండు వందల యాభై కోట్లకి పైగా షేర్‌ సాధించింది.

ఇక శాటిలైట్‌ హక్కులు వగైరా కలుపుకుంటే మూడొందల కోట్ల వరకు తేలుతుంది. అంటే ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి హిందీలో వున్న రీచ్‌ ఇది. మరి అలాంటప్పుడు ఎనభై కోట్లకి 2.0ని అవుట్‌ రైట్‌గా అమ్మేయడం తెలివైన పని ఎలా అవుతుంది? ఈ చిత్రం కూడా బాహుబలి 2 మాదిరిగా హోల్‌ ఇండియాని షేక్‌ చేస్తుందనే నమ్మకం వున్నట్టయితే ఎనభై కోట్ల ఆఫర్‌కి పడిపోకుండా రిస్కుకి దిగి సొంతంగా రిలీజ్‌ చేసుకోవాలి. మరి ఈ చిత్ర నిర్మాతలకి అంత నమ్మకం వుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు