త్రివిక్రమ్‌ లేకుండా కొట్టగలడా?

త్రివిక్రమ్‌ లేకుండా కొట్టగలడా?

'అఆ' సినిమాతో నితిన్‌కి యాభై కోట్ల క్లబ్‌లో స్థానం దక్కింది. అంతకుముందు పాతిక కోట్ల మార్కెట్‌ వున్న నితిన్‌కి అమాంతం రెట్టింపు షేర్‌ రావడానికి కారణం 'మాటల మాంత్రికుడు' అనేది అందరికీ తెలిసిన సంగతే. ఆ సినిమాతో వచ్చిన ఊపుని కొనసాగించడానికి తదుపరి చిత్రం విషయంలో నితిన్‌ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఎన్నో కథలు విని చివరకు హను రాఘవపూడితో 'లై' చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ చివరి దశకి చేరుకున్న ఈ చిత్రం ప్రమోషన్‌ యాక్టివిటీస్‌తో ఇంటర్నెట్‌లో 'బంబాట్‌' చేస్తోంది. ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ చిత్రం బడ్జెట్‌ నలభై కోట్లు పైమాటేనని ట్రేడ్‌ సర్కిల్స్‌ చెబుతున్నాయి. నితిన్‌ గత చిత్రం వసూళ్లతో పోల్చుకుంటే ఇది ఎక్కువ అనిపించదు కానీ, హను రాఘవపూడికి త్రివిక్రమ్‌ మాదిరిగా స్టార్‌డమ్‌ లేకపోవడం వల్ల ఈ ఖర్చు భారం మొత్తం నితిన్‌పై పడుతుంది.

పాతిక కోట్ల వరకు అవలీలగా రాబట్టగలనని నితిన్‌ ఇంతకుముందే ప్రూవ్‌ చేసుకున్నాడు. త్రివిక్రమ్‌ లేకుండా మరోసారి యాభై కోట్లు సాధించగలడా లేదా అనేది చూడాలి. 14 రీల్స్‌ పెట్టిన బడ్జెట్‌కి థియేటర్స్‌ నుంచి కనీసం యాభై కోట్ల షేర్‌ వసూలయితే తప్ప అందరూ లాభాల్లోకి చేరరని అంటున్నారు. హను రాఘవపూడికి పెద్ద కమర్షియల్‌ హిట్‌ ఏదీ లేకపోయినా ఇంతగా ఖర్చు పెట్టడానికి 'లై'లో ఏముందో అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు