బాహుబలి కాకుండా రెండే హిట్లు

బాహుబలి కాకుండా రెండే హిట్లు

బాహుబలి కారణంగా ఈ వేసవిలో భారీ సినిమాలు ఎక్కువగా విడుదల కాలేదు. బాహుబలికి ముందే రిలీజ్‌ అయిన 'కాటమరాయుడు' ఫ్లాప్‌ అయింది. ఇక మిగతా పెద్ద సినిమాలన్నీ బాహుబలికి దూరంగా వుండాలని వెనక్కి పోయాయి.

దీంతో సమ్మర్‌ని క్యాష్‌ చేసుకోవడానికి అన్నీ లో బడ్జెట్‌, మీడియం బడ్జెట్‌ చిత్రాలే వచ్చాయి. చెప్పుకోతగ్గ చిత్రాలు ఒక పది వరకు రిలీజ్‌ అయినా కానీ వాటిలో విజయవంతమైనవి రెండు మాత్రమే. వెంకటేష్‌ నటించిన 'గురు' నిర్మాతకి లాభాలు తెచ్చిపెట్టింది. నాగార్జున నిర్మించిన 'రారండోయ్‌ వేడుక చూద్దాం' కూడా సూపర్‌హిట్‌ కొట్టింది. ఈ రెండు సినిమాలు మినహా వేసవిలో రిలీజ్‌ అయిన చిత్రాల్లో ఏదీ యావరేజ్‌ మార్కు దాటలేకపోయింది. కేశవ, రాధ చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ పరంగా యావరేజ్‌ ఫలితంతో సరిపెట్టుకున్నాయి.

అయితే వేసవిలో ఎక్కువ హిట్లు లేని లోటుని బాహుబలి 2 ఒక్కటే తీర్చేసింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రెండు వందల కోట్ల షేర్‌ రావడంతో హిట్లు ఎక్కువ లేని లోటు కనిపించలేదు. అయితే బాహుబలి 2 రన్‌ ముగింపు దశకి రావడంతో ఇక తదుపరి రాబోతున్న 'దువ్వాడ జగన్నాథమ్‌'పై బిజినెస్‌ వర్గాలు గురి పెట్టాయి. అల్లు అర్జున్‌ ఫామ్‌ ఈ చిత్రంతో కొనసాగిస్తాడని, దీంతో మరో భారీ విజయం నమోదవుతుందని ఎదురు చూస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు