ఆల్‌ సైడ్స్‌ ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన ఎన్టీఆర్‌!

ఆల్‌ సైడ్స్‌ ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన ఎన్టీఆర్‌!

దేశంలోనే నంబర్‌వన్‌ దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటోన్న రాజమౌళికి జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం. దర్శకుడిగా తన కెరియర్‌లో కీలక మలుపుల్లో ఎన్టీఆర్‌ ఉన్నాడు. రాజమౌళి తొలి సినిమా, ఫస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ఎన్టీఆర్‌తోనే చేసాడు.

సోషియో ఫాంటసీతో, గ్రాఫిక్స్‌తో తొలి ప్రయోగం కూడా ఎన్టీఆర్‌ 'యమదొంగ'తోనే రాజమౌళి చేసాడు. ఆ తర్వాత విజువల్‌ ఎఫెక్ట్స్‌ని మరింతగా వాడుకునే సినిమాలతో రాజమౌళి ఎక్కడికో ఎదిగిపోయాడు. ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయాలనే ఆబ్లిగేషన్‌ రాజమౌళికి ఎప్పట్నుంచో వుంది. అయితే తాను ఎంచుకుంటోన్న కథలకి తారక్‌ ఇమేజ్‌ సూట్‌ కాకపోయే సరికి ఈమధ్య అతనితో చేయడం లేదు. బాహుబలి తర్వాత ఏ సినిమా చేయాలనేది రాజమౌళి ఇంకా డిసైడ్‌ కాకపోవడంతో అతనితో మరో చిత్రం చేయడానికి ఇదే రైట్‌ టైమ్‌ అని ఎన్టీఆర్‌ భావిస్తున్నాడు.

ఇప్పుడు స్లిప్‌ అయితే మళ్లీ ఈ అవకాశం రాదనేది ఎన్టీఆర్‌కి తెలుసు. అందుకే ఎలాగైనా రాజమౌళి తదుపరి చిత్రాన్ని కమిట్‌ చేయించడానికి ఎన్టీఆర్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. దానయ్య బ్యానర్లో రాజమౌళి చిత్రం చేయాలి కనుక అటు నిర్మాత వైపు నుంచి ఎన్టీఆర్‌ నరుక్కొస్తున్నాడు. దానయ్య దగ్గర తన డేట్స్‌ వుండడం ఎన్టీఆర్‌కి అనుకూలించే అంశం. ఇక ఇటు రాజమౌళి సన్నిహితులతో పాటు తన వర్గం మొత్తాన్ని కూడా ఎన్టీఆర్‌ వాడేస్తున్నాడు. ఎ

లాగైనా తారక్‌తోనే మలి చిత్రం చేయాలని రాజమౌళిపై చాలా మంది ఒత్తిడి తెస్తున్నారట. అవసరమైతే మిగతా కమిట్‌మెంట్స్‌ అన్నీ ఉన్నపళంగా డ్రాప్‌ అయిపోవడానికి సిద్ధమని ఎన్టీఆర్‌ కబురు పంపించాడట. రెండు, మూడేళ్లు పట్టినా కానీ ఓకే అని కూడా చెబుతున్నాడట. మామూలు కమర్షియల్‌ సినిమా తీసినా ఓకే అని, లేదా విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమున్న చిత్రం చేసినా ఫర్వాలేదని ఎన్టీఆర్‌ అన్నిటికీ రెడీ అనేస్తున్నాడట. కానీ ఇంకా రాజమౌళి మాత్రం కమిట్‌ అవలేదని, కానీ ఎన్టీఆర్‌ మాత్రం అతని ప్రయారిటీ లిస్ట్‌లో వున్నాడని సమాచారం.