త‌ప్ప‌దు.. మ‌హేశ్ బాబు కోర్టుకు రావాల్సిందే

త‌ప్ప‌దు.. మ‌హేశ్ బాబు కోర్టుకు రావాల్సిందే

శ్రీమంతుడి సినిమా వివాదం హీరో మ‌హేశ్ బాబును వ‌ద‌ల‌టం లేదు. 2012లో స్వాతి మాస‌ప‌త్రితో చ‌చ్చేంత ప్రేమ న‌వ‌ల‌ను కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమాను తీసిన‌ట్లుగా ఆర్ డీ విల్స‌న్ అలియాస్ శ‌ర‌త్ చంద్ర నాంప‌ల్లి కోర్టులో కేసు వేసిన సంగ‌తి తెలిసిందే. త‌న అనుమ‌తి లేకుండా త‌న న‌వ‌ల ఆధారంగా సినిమా నిర్మించ‌టం కాపీ ఉల్లంఘ‌నే అవుతుంద‌ని కోర్టు వేయ‌టం.. దీనిపై విచార‌ణ సంద‌ర్భంగా  త‌న‌కు వ్య‌క్తిగ‌త హాజ‌రుకు మిన‌హాయింపును మ‌హేశ్ బాబు కోరారు.

అయితే.. హీరో మ‌హేశ్ బాబుకు వ్య‌క్తిగ‌త హాజ‌రుకు మిన‌హాయింపు ఇవ్వ‌లేమ‌ని కోర్టు తేల్చి చెప్పింది. ఈ కేసు విచార‌ణలో భాగంగా నాంప‌ల్లి మొద‌టి అద‌న‌పు ఎంఎస్‌జే కోర్టు మ‌హేశ్ బాబుకు.. కొర‌టాల శివ‌ల‌కు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో వారు హైకోర్టును ఆశ్ర‌యించారు. విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. మ‌హేశ్‌.. కొర‌టాల‌కు విచార‌ణ‌కు హాజ‌రు నుంచి మిన‌హాయింపు ఇస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది.

దీనిపై తాజాగా మ‌రోసారి విచార‌ణ జ‌రిపారు. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత‌కు నోటీసులు ఇవ్వ‌ట‌మే కాదు.. హీరో మ‌హేశ్ బాబు వ్య‌క్తిగ‌తంగా కోర్టు హాజ‌రు కావాల్సిందేన‌ని నాంప‌ల్లి కోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో.. ఈ కేసు విచార‌ణ‌లో భాగంగా మ‌హేశ్ కోర్టుకు వెళ్ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు