పవన్‌ విషయంలో దిగొచ్చిన అల్లు అర్జున్‌!

పవన్‌ విషయంలో దిగొచ్చిన అల్లు అర్జున్‌!

ఏడాది క్రితం పవన్‌ పేరు ఎత్తడానికే నో అన్న అల్లు అర్జున్‌లో ఇప్పుడు చాలా మార్పు కనిపించింది. 'దువ్వాడ జగన్నాథమ్‌' ఆడియో వేడుకలో అల్లు అర్జున్‌ స్పీచ్‌లో రెండు, మూడు సార్లు పవన్‌ ప్రస్తావన అల్లు అర్జున్‌ స్పీచ్‌లో వచ్చింది. పవన్‌ అభిమానుల్ని గెలుచుకునే ప్రయత్నం చేయలేదు కానీ, పవన్‌కి తానేమీ వ్యతిరేకం కాదనే సంకేతం పంపించడానికి మాత్రం అల్లు అర్జున్‌ ప్రయత్నించినట్టే అనిపించింది.

హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ పవన్‌కళ్యాణ్‌ గురించి, విజయం పట్ల అతని థియరీ గురించి చెబుతూ వుంటే అల్లు అర్జున్‌ గట్టిగా క్లాప్స్‌ కొడుతూ, పవన్‌ గురించి మాట్లాడుతున్నంత సేపు హరీష్‌ పట్ల అటెన్షన్‌ పే చేస్తూ ముఖం తిప్పుకోకుండా, ఎలాంటి ఇబ్బంది చూపించకుండా వున్నాడు. పవన్‌ గురించి హరీష్‌ ఏమి చెబుతున్నా బన్నీ నవ్వుతూనే కనిపించాడు. అలాగే తన స్పీచ్‌లో ప్రత్యేకంగా పవన్‌ గురించి మాట్లాడకపోయినప్పటికీ పలుమార్లు అతని ప్రస్తావన తీసుకొచ్చాడు.

మెగా ఫాన్స్‌ అంటే ఈ ఫ్యామిలీలో వున్న హీరోలందరి ఫాన్స్‌ అనుకుంటామని, ఒక్కొక్కరికీ వేరు వేరు ఫాన్స్‌ వున్నారని అనుకోమని, ఇన్‌డైరెక్టుగా తన ఫాన్స్‌, పవన్‌ ఫాన్స్‌ వేరు కాదని అల్లు అర్జున్‌ చెప్పాడు. ఏది ఏమైనా ఈ ఆడియో వేడుక తర్వాత పవన్‌ వర్సెస్‌ అర్జున్‌ ఫాన్స్‌ మధ్య జరుగుతున్న వార్‌ చల్లబడే అవకాశాలైతే లేకపోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు