జూనియర్ ఎన్టీఆర్ అంటే స్పందించని బాలయ్య

జూనియర్ ఎన్టీఆర్ అంటే స్పందించని బాలయ్య

ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ ఎంత సన్నిహితంగా ఉండేవాళ్లో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తారక్ సినిమాల వేడుకలకు బాలయ్య.. బాలయ్య సినిమాల వేడుకలకు తారక్ వచ్చేవాళ్లు. కానీ గత నాలుగైదేళ్లుగా ఇద్దరికీ అంత మంచి సంబంధాలేమీ ఉన్నట్లు కనిపించట్లేదు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. మీడియా వాళ్లు బాలయ్య గురించి అడిగితే ఎన్టీఆర్ తమ మధ్య ఏమీ లేదని రెండు ముక్కల్లో తేల్చేస్తున్నాడు కానీ.. బాలయ్య మాత్రం తన అన్న కొడుకు గురించి మాట్లాడేందుకు అసలేమాత్రం ఇష్టపడట్లేదు. మీడియా వాళ్లు అడిగినా దాట వేసే ప్రయత్నం చేస్తున్నాడు.

తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్య అభిమానులతో చిట్ చాట్ చేసినపుడు ఆయనకు ఎన్టీఆర్ గురించి బోలెడు ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ వేటికీ ఆయన స్పందించట్లేదు. తరచుగా ఎన్టీఆర్ గురించి ప్రశ్నలు ఎదురవుతున్నా ఆయన పట్టించుకోలేదు. సినిమాలు.. రాజకీయాలు.. వ్యక్తిగత జీవితం..  ఇలా చాలా అంశాల గురించి మాట్లాడిన బాలయ్య.. ఎన్టీఆర్ ఊసెత్తడానికి మాత్రం ఇష్టపడలేదు. ‘‘మీకు ఎదురవుతున్న ప్రశ్నల్లో 90 శాతం ఎన్టీఆర్ గురించే ఉన్నాయి. అయినా మీరు స్పందించరేంటి’’ అంటూ ఓ అభిమాని రెట్టించి అడిగినా.. కొందరు బాలయ్యను కవ్వించే ప్రయత్నం చేసినా ఆయన పట్టించుకోకుండా తన పని తాను చేసుకెళ్లిపోయాడు. దీన్ని బట్టి బాబాయ్-అబ్బాయ్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు