ఇది మగధీరకే ఇన్సల్ట్‌ సుమీ

ఇది మగధీరకే ఇన్సల్ట్‌ సుమీ

'రాబ్తా' ట్రెయిలర్‌ చూసి 'మగధీర' సినిమాని కాపీ కొట్టేసారని అనుకున్నారు. అల్లు అరవింద్‌ కూడా అదే ఫీలయి ఆ చిత్రం విడుదల ఆపేయాలంటూ కోర్టుకి వెళ్లారు. అయితే పునర్జన్మలు, ప్రేమికులు తప్ప మరో ఎలిమెంట్‌ ఏమీ లేకపోవడంతో 'మగధీర'కి కాపీ కాదని కోర్టు తేల్చేసింది.

శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ చిత్రాన్ని విమర్శకులు చీల్చి చెండాడుతున్నారు. బాలీవుడ్‌లో ఈ ఏడాది వచ్చిన అతి చెత్త చిత్రం ఇదేనంటూ ఎవరికి వారు దీనిని తూట్లు పొడిచేస్తున్నారు. సుషాంత్‌ సింగ్‌ రాజ్‌పుట్‌, కీర్తి సనన్‌తో పాటు దర్శకుడు దినేష్‌ని కూడా తిట్టి పోస్తున్నారు. మగధీర కాన్సెప్ట్‌ని తీసుకుని ఈ చిత్ర రచయితలు సరికొత్త సెటప్‌తో రాబ్తాని తీర్చిదిద్దారు. కాపీరైట్స్‌ సమస్య వస్తుందని మగధీరతో పోలిక రాకుండా సెటప్‌ మొత్తం మార్చేసారు. దీంతో ఈ సినిమా కంగాళీగా తయారైంది.

ఒకదానికి ఒకటి లింకు లేని సీన్లతో ఈ సినిమా ప్రేక్షకులకి నరకం చూపిస్తోంది. ఈ చిత్రాన్ని మగధీరతో పోలిస్తే దానికే అవమానమని నార్త్‌ ఆడియన్సే అంటున్నారు. మగధీర చిత్రం అనువాద వెర్షన్‌ని నార్త్‌లో బాగానే చూసారు. 'బాహుబలి' దర్శకుడి సినిమా అనే క్రేజ్‌ 'మగధీర'ని అక్కడ మరింత పాపులర్‌ చేసింది.

సుబ్బరంగా 'మగధీర'ని మక్కీకి మక్కీ కాపీ కొట్టేసి ఒరిజినల్‌ నిర్మాతలకి నష్ట పరిహారం చెల్లించుకోవాల్సిందని, ఇలాంటి చెత్త సినిమా తీసి జనం నెత్తిన రుద్దడం దేనికని ఈ సినిమా హీరోని ట్యాగ్‌ చేసి మరీ తిడుతున్నారు. ధోనీ బయోపిక్‌తో వంద కోట్ల క్లబ్‌లో చేరిన సుషాంత్‌ 'రాబ్తా'తో స్టార్‌గా సెటిల్‌ అయిపోవచ్చునని అనుకున్నాడు కానీ రాబ్తా అతని రాత మార్చేసింది పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English