బాల‌య్య 102.. పాత లుక్సే దొరికాయా?

బాల‌య్య 102.. పాత లుక్సే దొరికాయా?

గ‌తంలో బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మాత‌గా నంద‌మూరి బాల‌కృష్ణతో ‘హ‌ర‌హ‌ర మ‌హ‌దేవ అనే సినిమా ఒక‌టి అనౌన్స్ చేశారు. ఐతే ప్రారంభోత్స‌వానికి ముందు రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు పెద్ద క‌ల‌క‌లమే రేపాయి. మ‌మ్ముట్టి హీరోగా మ‌ల‌యాళంలో చేసిన సినిమా నుంచి ఫొటోలు తీసుకుని అందులో మమ్ముట్టి త‌ల తీసి బాల‌య్య‌ది పెట్టి పోస్ట‌ర్లు వ‌ద‌ల‌డంతో జ‌నాలు దాని మీద కామెడీలు చేశారు. ఆ వివాదం వ‌ల్లేనో ఏమో ఆ సినిమానే చేయ‌కుండా ఆగిపోయాడు బాల‌య్య‌. ఇప్పుడు బాల‌య్య 102వ సినిమాకు సంబంధించి నిర్మాత సి.క‌ళ్యాణ్ రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు చూస్తే.. నాటి కాంట్ర‌వర్శీనే గుర్తుకొస్తోంది.

బాల‌య్య‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెబుతూ ఈ నంద‌మూరి హీరోతో చేయ‌బోతున్న సినిమాను కూడా ప్ర‌క‌టిస్తూ రెండు పోస్ట‌ర్లు రిలీజ్ చేశాడు సి.క‌ళ్యాణ్‌. ఇందుకోసం న‌ర‌సింహ‌నాయుడు, లెజెండ్ సినిమాల్లోని బాల‌య్య లుక్స్ వాడుకున్నారు. ఐతే పూర్తిగా బాల‌య్య పాత లుక్స్ తీసుకోకుండా.. ముఖం వ‌ర‌కు ఫొటో షాప్ లో ఏదో మార్పు చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇది కొంచెం తేడా కొట్టిన‌ట్లే ఉంది. ఇదేదో జ‌స్ట్ విషెస్ కోసం వాడుకున్న పాత లుక్స్ లాగా లేవు. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల లాగా వీటిని డిజైన్ చేశారు.

ఇలాంటివి జ‌నాల‌కు రాంగ్ మెసేజ్ ఇస్తాయి. అస‌లే సోష‌ల్ మీడియాలో జ‌నాలు ఇలాంటి లొసుగుల కోసమే ఎదురు చూస్తుంటారు. లూప్ హోల్ దొర‌గ్గానే ట్రోలింగ్ మొద‌లుపెట్టేస్తారు. కాబ‌ట్టి జాగ్ర‌త్త‌గా ఉండాలి. ‘‘శత చిత్ర నటసింహ.. తెలంగాణ లక్ష్మీనరసింహ..నవ్యాంధ్రా నరసింహ.. రాయలసీమ సమరసింహ..  మా జయసింహ’’... అంటూ విషెస్ చెప్ప‌డం ద్వారా ఈ సినిమా పేరు ‘జయసింహ’ అన్న ప్ర‌చారం నిజ‌మే అన్న సంకేతాలిచ్చాడు క‌ళ్యాణ్‌. త‌మిళ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడ‌న్న సంగ‌తి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English