బాహుబలి ఎఫెక్ట్‌తో సెట్స్‌ మీద పడ్డారు

బాహుబలి ఎఫెక్ట్‌తో సెట్స్‌ మీద పడ్డారు

నిన్న మొన్నటి వరకు భారీ సెట్స్‌ వేయడమంటేనే మన వాళ్లు ఆసక్తి చూపించేవాళ్లు కాదు. సెట్స్‌ వేసే దర్శకులు గుణశేఖర్‌లాంటి వాళ్లపై జోకులు కూడా వేసేవారు. కానీ సెట్స్‌ వేసి భారీ బ్లాక్‌బస్టర్‌ కొట్టిన బాహుబలి ఇన్‌స్పిరేషన్‌తో ఇప్పుడు చాలా సినిమాలకి సెట్స్‌ నిర్మిస్తున్నారు.

పవన్‌, త్రివిక్రమ్‌ సినిమా కోసం ఏకంగా దుబాయ్‌ సెట్‌ వేస్తున్నారట. ఎన్టీఆర్‌ 'జై లవకుశ' ప్యాలెస్‌ సెట్‌ నిర్మించారు. మహేష్‌తో కొరటాల తీసే సినిమా కోసం అసెంబ్లీ, సెక్రటేరియేట్‌ పునఃసృష్టిస్తున్నారు. కోట్ల వ్యయంతో వేస్తోన్న ఈ సెట్స్‌ ఏవీ మునుపటిలా పూర్తి స్థాయి సెట్స్‌ కాకపోవడం విశేషం.

బాహుబలి నుంచి స్ఫూర్తి పొంది కేవలం హైలైట్స్‌ మాత్రమే ఆర్ట్‌ డైరెక్టర్‌తో రూపొందిస్తున్నారు. మిగతాది గ్రీన్‌ మ్యాట్‌లో తీసి గ్రాఫిక్స్‌ సాయంతో పూర్తి డెకరేషన్‌ చేస్తారు. గతంలో పది కోట్ల వ్యయం అయ్యే సెట్‌ ఇప్పుడు కోటిన్నరలోనే అయిపోతోందట.

మరో కోటి రూపాయలు చెల్లిస్తే సదరు సెట్‌కి సంబంధించిన గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తయిపోతుంది. ఇలా తక్కువ బడ్జెట్‌లోనే కావాల్సిన సెట్‌ తయారైపోతూ వుండేసరికి విజువల్‌ అప్పీల్‌ మీద మళ్లీ దృష్టి పెరిగింది. ఈమధ్య కాలంలో ఎన్నడూ లేనిది వరుసగా అన్ని చిత్రాలకీ సెట్స్‌కి సంబంధించిన వార్తలే మీడియాలో దర్శనమిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English