ఏపీ కాంగ్రెస్ లీడర్ కు వాజ్ పేయి బీఫ్ వడ్డించారట

ఏపీ కాంగ్రెస్ లీడర్ కు వాజ్ పేయి బీఫ్ వడ్డించారట

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బీఫ్ విషయంలో వ్యవహరిస్తున్న విధానంతో దేశమంతా అలజడి రేగుతున్న సంగతి తెలిసిందే. ఈశాన్య రాష్ర్టాలకు చెందిన కొందరు బీజేపీ నేతల నుంచీ దీనిపై వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే... తాజాగా ఏపీకి చెందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ సంచలన విషయాన్ని బయటపెట్టడంతో ఒక్కసారిగా బీజేపీలో కలకలం రేగింది. బీజేపీ లెజెండరీ లీడర్, మాజీ ప్రధాని వాజపేయి తనకు స్వయంగా ఒక సందర్భంలో గొడ్డుమాంసం వడ్డించారని చింతామోహన్ అనడం సంచలనంగా మారింది.    

వాజపేయి తనకు గొడ్డు మాంసాన్ని వడ్డించిన నాటికి ఆయన ప్రధానిగా లేరని.. ఆ ఘటన జరిగిన ఏడాదిలోనే ఆయన ప్రధాని అయ్యారని మోహన్ చెప్పారు. 1997లో ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్ పేయి... తనతో పాటు, బీఎస్పీ అధినేత కాన్షీరామ్ ను విందుకు ఆహ్వానించారని... వాజ్ పేయి ఇంట్లోనే పశుమాంసంతో చేసిన వంటకాలను స్వయంగా వడ్డించారని చెప్పారు.

భారతదేశంలో ఎవరు ఏది తినాలో, ఏది తినకూడదో చెప్పే అధికారం ఎవరికీ లేదని ఆయన తెలిపారు. బీఫ్ అమ్మకాలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  చింతా మోహన్ వ్యాఖ్యలపై ఎలా స్పందించాలో కూడా తెలియని స్థితిలో బీజేపీ ఇరుక్కుపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు