కళ్యాణ్ రామ్ మంచి పని చేశాడు

కళ్యాణ్ రామ్ మంచి పని చేశాడు

ఈ రోజుల్లో వివాదాలు లేకుండా ఓ పెద్ద సినిమా రిలీజవడం అన్నది అరుదైన విషయంగా మారిపోయింది. ఒక సినిమాకు సంబంధించి.. మరో సినిమాతో ఏదైనా పోలిక కనిపిస్తే చాలు.. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయిపోతోంది. చాలా సినిమాల్ని కాపీ వివాదాలు చుట్టుముడుతున్నాయి.

ఈ శుక్రవారం విడుదలువుతున్న బాలీవుడ్ మూవీ 'రాబ్తా'ను తెలుగు బ్లాక్ బస్టర్ 'మగధీర'ను కాపీ కొట్టి తీశారంటూ కొన్ని రోజులుగా ఓ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్ వాళ్లు ఈ విషయమై నోటీసులు కూడా ఇచ్చారు. విడుదలకు ముందు ఈ వివాదాన్ని ఆఫ్ ద కోర్ట్ సెటిల్ చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ మూవీ 'జై లవకుశ' విషయంలోనూ ఆల్రెడీ కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

తమిళంలో దశాబ్దం కిందట వచ్చిన అజిత్ సినిమా 'వరలారు' స్ఫూర్తితో 'జై లవకుశ' తీస్తున్నారంటూ చాన్నాళ్ల నుంచి ప్రచారం జరుగుతోంది. అజిత్ 'వరలారు'లో త్రిపాత్రాభినయం చేస్తుంటే.. 'జై లవకుశ'లో ఎన్టీఆర్ కూడా మూడు పాత్రలు పోషిస్తుండటమే ప్రధానంగా ఈ ప్రచారానికి దారి తీసింది. ఐతే ఈ ప్రచారం నేపథ్యంలో సినిమా విడుదలకు సిద్ధమయ్యాక 'వరలారు' టీం నుంచి ఏమైనా అభ్యంతరాలు వ్యక్తమవుతాయేమో అని నిర్మాత కళ్యాణ్ రామ్ ముందే అప్రమత్తం అయ్యాడట.

'వరలారు' నిర్మాతను హైదరాబాద్ కు పిలిపించి.. ఈ సినిమా స్క్రిప్టును చేతికిచ్చి 'వరలారు'తో పోలికలేమీ లేవన్న క్లారిటీ వాళ్లకు ఇచ్చాడట. మామూలుగా కళ్యాణ్ రామ్ వివాదాలకు దూరంగా ఉంటాడు. కొందరు వివాదాల్ని పబ్లిసిటీ కోసం ఉపయోగించుకుంటారు కానీ.. తాను ఆ రకం కాదని రుజువు చేస్తూ 'జై లవకుశ'ను కాంట్రవర్శీకి దూరం పెట్టాడు నందమూరి హీరో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు