అతనితో లింక్‌... అనుష్క ఫైర్‌

అతనితో లింక్‌... అనుష్క ఫైర్‌

తనపై ఎన్ని వదంతులు వచ్చినా నవ్వుతూ కొట్టి పారేసే అనుష్క ఈసారి ఎందుకో చాలా కోపంగా వుంది. ప్రభాస్‌తో లింక్‌ పెట్టి తన గురించి రాస్తోన్న వార్తల పట్ల అనుష్క ఘాటుగా స్పందిస్తోంది. అలాంటి రాతలు రాసే వారి మీద కేసులు పెట్టి కోర్టుకి లాగుతానని బెదిరిస్తోంది.

ప్రభాస్‌తో అలాంటి రిలేషన్‌ లేదని అనుష్క ఎప్పుడో స్పష్టం చేసినా కానీ మీడియా వాళ్లిద్దరికీ లింక్‌ పెట్టడం మానలేదు. హీరోయిన్లకి ఇలాంటి లింకప్స్‌ మామూలేనని తెలిసిన అనుష్క సహజంగా ఇలాంటి వాటికి రియాక్ట్‌ అవ్వదు. కానీ ప్రభాస్‌తో లింకప్‌ మాత్రం ఆమెని బాగా ఇబ్బంది పెడుతోంది. కారణమేంటనేది తెలియదు కానీ ఈ లింకప్‌ గురించి మాత్రం అనుష్క తన స్వభావానికి విరుద్ధంగా స్పందిస్తోంది. బాహుబలి జంట కావడంతో వీరిపై రూమర్స్‌ని నేషనల్‌ మీడియా కూడా కవర్‌ చేస్తోంది.

అయితే మరెవరితోనో రిలేషన్‌లో వుందని అనుష్క గురించి సీరియస్‌ గాసిప్స్‌ ఎప్పట్నుంచో వున్నాయి. బహుశా ప్రభాస్‌తో లింకప్‌ వల్ల ఆ సంబంధం బీటలు వారుతోందో ఏమో, అనుష్క ఈ ఊసు ఎత్తితేనే కేసు అంటోంది. మరోవైపు ప్రభాస్‌ మాత్రం తన గురించి ఏమి రాసుకుంటున్నా బిందాస్‌గా తీసి పారేస్తున్నాడు. అనుష్క తనకి మంచి ఫ్రెండ్‌ మాత్రమేనని అతను ఎప్పుడో స్పష్టం చేసాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు