నా 'సుచీ లీక్స్‌' వీడియో కోసం వెయిటింగ్‌ - అమల

నా 'సుచీ లీక్స్‌' వీడియో కోసం వెయిటింగ్‌ - అమల

సింగర్‌ సుచిత్ర సుచి లీక్స్‌ పేరిట చేసిన సంచలనం గురించి తెలియని వారుండరు. తమిళ సినిమా సెలబ్రిటీలు కొందరిని బజారున పెట్టి, మరికొందరి భాగోతాలు బయట పెడతానంటూ హెచ్చరించిన ఆమె తర్వాత సోషల్‌ మీడియా నుంచి మాయమైంది. ప్రస్తుతం విదేశాల్లో వుంటోన్న సుచిత్ర ఈ వివాదం నుంచి తేరుకునే ప్రయత్నాల్లో వుంది. తన దగ్గర ఫలానా వాళ్ల వీడియోలున్నాయంటూ సుచిత్ర పదే పదే అమలా పాల్‌ గురించి ప్రస్తావించేది.

ఆమె ధనుష్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో చేసిన రాసలీలలు ఒక ఆదివారం నాడు బయటపెడతానంటూ ప్రకటించింది. ఆ తర్వాత సుచిత్ర కనిపించకుండా పోయింది. ఇంతకాలం దీని గురించి స్పందించని అమలా పాల్‌ 'విఐపి 2' ప్రమోషన్స్‌లో మీడియాకి దొరికింది. ఈ సందర్భంగా ఆమెతో ఈ వీడియోల ప్రస్తావన వస్తే ''ఆ వీడియోలు చూద్దామని నేను కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఎన్ని ఆదివారాలు గడిచినా ఆ వీడియోలు ఇంకా బయటకి రాలేదేంటో?'' అంటూ వెటకారంగా స్పందించింది.

సుచిత్ర దగ్గర ఏ వీడియోలు లేవని, కేవలం గిమ్మిక్స్‌ చేసిందని అమల అంటోంది. అయితే పెద్ద తలకాయల ఇన్‌వాల్వ్‌మెంట్‌ వుండడంతో, కోలీవుడ్‌ పెద్దలే పూనుకుని సుచిత్రని దేశం దాటించేసారనే మరో పుకారు కూడా చలామణీలో వుంది. విశేషం ఏమిటంటే ఇప్పటికీ సుచీ లీక్స్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో తరచుగా ఏదో ఒక ఫేక్‌ అకౌంట్‌ నుంచి కొన్ని ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు