అయ్యయ్యో శృతి గాలి తీసేసారు

అయ్యయ్యో శృతి గాలి తీసేసారు

శృతిహాసన్‌కి కొద్ది కాలంగా ఏది చేసినా కలిసి రావడం లేదు. ఇప్పటికే కెరియర్‌ ఇబ్బందుల్లో పడింది. చేతిలో సినిమాలు లేని పరిస్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం విడుదలవుతోన్న 'బెహన్‌ హోగీ తేరీ' చిత్రంపై శృతి చాలా ఆశలు పెట్టుకుంది. అంతగా పేరు లేని నటుడు రాజ్‌ కుమార్‌ రావుతో శృతి జంటగా నటించిన ఈ కామెడీ చిత్రం ట్రెయిలర్స్‌ ఆకర్షణీయంగానే అనిపించాయి. అయితే ఈ సినిమాకి ప్రీమియర్స్‌ నుంచి వస్తోన్న రివ్యూలు మరోసారి శృతిహాసన్‌కి ఫెయిల్యూర్‌ తప్పదని ఘోషిస్తున్నాయి.

ఫ్లాప్‌ కంటే కూడా ఈ రివ్యూల్లో అందరూ ముక్తకంఠంతో శృతిహాసన్‌ని మైనస్‌ పాయింట్‌గా చెబుతున్నారు. ఈమధ్య శృతి ఏ చిత్రంలో నటించినా ఈ ఫీడ్‌బ్యాక్‌ కామన్‌ అయిపోయింది. ప్రేమమ్‌, కాటమరాయుడు చిత్రాలకి ఆమె దారుణంగా ట్రోలింగ్‌కి గురయింది. తాజాగా 'బెహన్‌ హోగీ తేరీ' చిత్రంలో రావు అద్భుతంగా నటించాడని, కానీ అతడికి సరయిన జోడీని పెట్టి వుండాల్సిందని, ఆమె వల్ల ఈ చిత్రం మరింత విసిగించిందని విమర్శకులు రాస్తున్నారు.

రిలీజ్‌కి ముందు అంత చిన్న హీరోతో నటిస్తున్నావేంటంటూ శృతిహాసన్‌ని అడిగిన వాళ్లే ఇప్పుడు ఈ చిత్రానికి తనే మైనస్‌ అని ముద్ర వేసేస్తున్నారు. ఒక టైమ్‌లో రాణిలా వెలిగిపోయిన శృతి సడన్‌గా ఇలా క్రేజ్‌ కోల్పోవడమే కాకుండా విమర్శల పాలవడమేమిటో, టైమ్‌ బ్యాడ్‌ కాకపోతే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు