లారెన్స్.. మళ్లీ తెలుగు సినిమా

లారెన్స్.. మళ్లీ తెలుగు సినిమా

రాఘవ లారెన్స్ డ్యాన్స్ డైరెక్టర్‌గా ఎక్కువ పేరు సంపాదించింది.. ఆ తర్వాత హీరో అవతారమెత్తింది.. ఆపై దర్శకుడిగా మారింది తెలుగులోనే. దర్శకుడిగా లారెన్స్ తొలి సినిమా 'మాస్' అన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తెలుగులో స్టైల్, డాన్, రెబల్ లాంటి సినిమాలు చేశాడు లారెన్స్. ఐతే చివరగా చేసిన 'రెబల్' చేదు అనుభవాన్ని మిగల్చడంతో మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు.

తమిళంలో కాంఛన, గంగ సినిమాలు చేసి వాటిని తెలుుగలోనూ రిలీజ్ చేశాడు. హిట్లు కొట్టాడు. 'కాంఛన' చేసే సమయానికి లారెన్స్‌కు తెలుగులో అంత డిమాండ్ లేకపోయినప్పటికీ.. ఆ చిత్రానికి పెట్టుబడి పెట్టి అతడికి అండగా నిలిచాడు నిర్మాత బెల్లంకొండ సురేష్. ఆ సినిమాలు రెండూ ఇద్దరికీ మంచి ఫలితాన్నిచ్చాయి.

తనకు కష్ట కాలంలో అండగా నిలిచిన బెల్లంకొండ సురేష్ కోసం లారెన్స్ ఇప్పుడు ఓ సాయం చేయబోతున్నాడట. ఆయన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పెట్టి తెలుగులో సినిమా తీస్తాడట. 'అల్లుడు శీను' సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్‌ ఎంట్రీ బాగానే జరిగింది. ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న అతను.. ఆ తర్వాత శ్రీవాస్‌తో జత కడుతున్నాడు.

దీని తర్వాత లారెన్స్‌తో శ్రీనివాస్ సినిమా ఉంటుందని సమాచారం. లారెన్స్ స్టయిల్లో ఊర మాస్ సినిమా చేస్తే బెల్లంకొండ శ్రీనివాస్ మాస్ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతాడని సురేష్ భావిస్తున్నాడట. 'గంగ' తర్వాత మెగా ఫోన్ పక్కన పెట్టేసి హీరోగా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు లారెన్స్. 'కాంఛన' సిరీస్‌లో భాగంగా చేయాల్సిన 'నాగ' పక్కకు వెళ్లిపోయింది. దర్శకుడిగా లారెన్స్ పునరాగమనం బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాతోనే జరగొచ్చని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు