కాపీ కేసును కోర్టు బ‌య‌ట క్లోజ్ అయ్యింది

కాపీ కేసును కోర్టు బ‌య‌ట క్లోజ్ అయ్యింది

వ‌రుస వివాదాల‌తో త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కిన రాబ్తాకు సంబంధించిన మ‌రో వివాదం సెటిల్ అయిపోయిన‌ట్లే. మ‌రో రోజులో రిలీజ్ కావాల్సిన ఈ మూవీకి సంబంధించి కాపీ కేసుతో విడుద‌ల ఏమ‌వుతుంద‌న్న విష‌యంపై కాస్తంత డౌట్ ఉంది. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో కేసు క‌థ కంచికి వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు.

బాలీవుడ్ న‌టులు సుషాంత్ సింగ్ రాజ్ పుత్‌.. కృతి స‌న‌న్ లు న‌టించిన చిత్రం రాబ్తా. ఈ సినిమా స్క్రిప్ట్.. గ‌తంలో తెలుగులో ఘ‌న విజ‌యం సాధించిన మ‌గ‌ధీరను కాపీ కొట్టిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. వీటిని నిజం చేస్తూ.. రాబ్తా త‌మ సినిమాను కాపీ కొట్టి తీస్తున్న‌దేనంటూ ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ కోర్టులో కేసు వేయ‌టం హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. ఈ సినిమాను తాము కాపీ కొట్ట లేదంటూ రాబ్తా నిర్మాత‌లు చెప్పుకున్నారు.

మ‌రో వైపు కేసు విష‌యంలో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని అల్లు అర‌వింద్ డిసైడ్ అయిన‌ట్లు చెప్పారు. ఇలాంటి వేళ‌.. ఈ ఇష్యూకు సంబంధించి ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఒక‌టి చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాపీ కేసులో రాబ్తా నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గిన‌ట్లుగా స‌మాచారం.

కేసును కోర్టు బ‌య‌ట చ‌ర్చ‌ల ద్వారా సెట్ చేసుకుందామ‌న్న రాబ్తా నిర్మాత‌ల సూచ‌న‌తో అల్లుఅర‌వింద్ ఓకే అన్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌ధ్య‌వ‌ర్తుల మ‌ధ్య‌న ఇష్యూను సాఫ్ట్ గా క్లోజ్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో.. కోర్టులో ఉన్న కేసును ఉప‌సంహ‌రించుకోవ‌టం ద్వారా రాబ్తా రిలీజ్‌కు ఎలాంటి ఇబ్బంది లేద‌ని చెబుతున్నారు. మొత్తానికి త‌న కాపీ ఆరోప‌ణ‌లు నిజ‌మేన‌న్న విష‌యాన్ని అల్లు అరవింద్ తేల్చిన‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. సెటిల్ మెంట్ అమౌంట్ ఎంత‌న్న‌ది ఇంకా బ‌య‌ట‌కు రాలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English