సూర్యకి కోపమొచ్చింది!

సూర్యకి కోపమొచ్చింది!

ఎప్పుడూ  చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా కనిపించే తమిళ తంబి సూర్యకి కోపమొచ్చింది. ఆ కోపానికి కారణం మరెవ్వరో కాదు. తనకు ఇష్టమైన దర్శకుడు...  గౌతమ్ మీనన్. `ధ్రువ నక్షత్రం` పేరుతొ ఓ సినిమా తీస్తానని చెప్పి సూర్య కాల్ షీట్లు ఇప్పించుకున్నాడు గౌతం మీనన్. ఇదివరకు తనకు `సూర్య సన్ ఆఫ్ కృష్ణన్` లాంటి ఓ మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు కావడంతో కాదనకుండా కాల్ షీట్లు కేటాయించాడు సూర్య.

అయితే గౌతం మీనన్ మాత్రం నెలలు గడుస్తున్నా సినిమా మొదలుపెట్టడం లేదట. అక్కడికి ఆరు నెలలు ఓపిక పట్టాడు సూర్య. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ఈ ప్రాజెక్ట్ నుంచి బయటికోచ్చేసినట్టు ప్రకటించేశారు సూర్య. ఆ మేరకు శుక్రవారం మీడియాకి ఓ ప్రెస్ నోట్ పంపారు. ఇప్పటికే ఆరు నెలలుగా వెయిట్ చేస్తున్నాననీ, ఇక అభిమానులకు సమాధానం చెప్పలేకపోతున్నాననీ... క్రమం తప్పకుండా వారికి వినోదం పంచి పెట్టాల్సిన బాధ్యత నాపై ఉందని చెబుతూ ఆ ప్రాజెక్టు నుంచి బయటికొచ్చిన విషయాన్ని చెప్పారు.

ప్రస్తుతం సూర్య లింగుస్వామి దర్శకత్వంలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో సమంత కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English