ముద్దులు హ‌ద్దులు దాటేశాయ‌ట‌

ముద్దులు హ‌ద్దులు దాటేశాయ‌ట‌

మ‌గ‌ధీర చిత్రాన్ని కాపీ కొట్టిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న రాబ్తా గుర్తుందా? ఇప్పుడీ సినిమాకు సంబంధించిన మ‌రో కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. సుషాంత్ సింగ్ రాజ్ పుత్‌.. కృతి స‌న‌న్ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా ఈ వారం విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీని చూసిన కేంద్ర సెన్సార్ బోర్డు స‌భ్యులు.. క‌ట్ ల మీద క‌ట్ లను సూచించార‌ట‌.

ఈ సినిమాలో చాలా సంద‌ర్భాల్లో ఉప‌యోగించిన ప‌దాలు బాగోలేవ‌ని.. ముద్దుల స‌న్నివేశాలైతే ఏకంగా హ‌ద్దులు దాటేసిన‌ట్లుగా వారు ఫీలైన‌ట్లుగా చెబుతున్నారు. మ‌రీ.. కొన్ని ముద్దులైతే గాఢంగా ఉన్నాయ‌ని.. బాలీవుడ్ ముద్దుల రేంజ్‌ను పూర్తిగా దాటేసిన‌ట్లుగా చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

సినిమాకు యు/ఏ స‌ర్టిఫికేట్ కావాలంటే మాత్రం కొన్ని ముద్దుల డోసుల్ని దాదాపుగా క‌ట్ చేయాల‌ని.. అప్పుడు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌ని చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. లేదంటే ఎ ప‌క్కా అని స్ప‌ష్టం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టికే చిత్ర‌క‌థ‌ను.. ఒక పాట‌ను కాపీ చేసిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈ మూవీకి సెన్సార్ నుంచి చిక్కులు ఎదురుకావ‌టం విశేషం. మ‌రి.. ముద్దుల్ని ట్రిమ్ చేస్తారా? లేక‌.. ఎ స‌ర్టిఫికేట్‌కు ఓకే అనేస్తారా? అన్న‌ది మాత్రం తేలాల్సి ఉంది. వ‌రుస వివాదాల‌తో త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కుతున్న ఈ చిత్రానికి ప్రేక్ష‌కుల తీర్పు ఎలా ఉంటుంద‌న్న‌ది ఈ శుక్ర‌వారం తేలిపోనుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English