గిల్టు ఉంగరాల రాంబాబు!

గిల్టు ఉంగరాల రాంబాబు!

సునీల్‌కి నిఖార్సయిన హిట్టొచ్చి చాలా కాలమవుతోంది. పూలరంగడు తర్వాత మొదలైన సునీల్‌ స్ట్రగుల్‌ ఇంకా ఒక దారికి రాలేదు. కమెడియన్‌ నుంచి హీరోగా మారిన సునీల్‌ కామెడీ హీరో అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే కమర్షియల్‌ సినిమాలు చేస్తూ యాక్షన్‌ పాత్రలతో మాస్‌ హీరో అయిపోదామని చూసాడు.

ఆ ప్రయత్నాల్లో భయంకరమైన ఎదురు దెబ్బలు తగిలేసరికి సునీల్‌ దారికొచ్చేసాడు. మళ్లీ కామెడీ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అతని తాజా చిత్రం 'ఉంగరాల రాంబాబు' ఈ ప్రయత్నంలో భాగంగా చేసినదే. కామెడీ కోసమని కామెడీ చేయడం వల్ల ఇప్పుడు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే నాసిరకం కామెడీ చిత్రాలు చేసిన అల్లరి నరేష్‌కి ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయి. రెగ్యులర్‌ సినిమాల్లోనే కామెడీ బ్రహ్మాండంగా వుంటోన్న రోజుల్లో అచ్చంగా కామెడీ సినిమా తీసినపుడు దానినుంచి చాలా ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు.

'ఉంగరాల రాంబాబు' ట్రెయిలర్‌లో ఒక్క జోక్‌ అయినా పేలలేదు. కామెడీ కోసం చాలా క్యారెక్టర్లు వున్నాయి కానీ ట్రెయిలర్‌ వరకు ఈ రాంబాబువి 'గిల్టు ఉంగరాలే' అనే ఫీలింగ్‌ వస్తుంది. సినిమాలో అయినా 'గోల్డు ఉంగరాల రాంబాబు' అనిపిస్తాడో లేదో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు