కాజల్‌ కోసం క్వీన్‌ పడిగాపులు

కాజల్‌ కోసం క్వీన్‌ పడిగాపులు

కంగన రనౌత్‌ నటించిన 'క్వీన్‌' చిత్రాన్ని దక్షిణాదిలోని అన్ని భాషల్లోను రీమేక్‌ చేయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. తమన్నా ఓకే చెప్పడంతో ఈ చిత్రం దాదాపు సెట్స్‌ మీదకి వెళ్లిపోయింది. కానీ తమన్నా భారీ పారితోషికం అడిగే సరికి నిర్మాతలు కంగారు పడి ఆమెకి టాటా చెప్పేసారు. అప్పట్నుంచీ మరో కథానాయకి కోసం ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి.

తాజాగా ఈ చిత్రం కాజల్‌ దగ్గరకి వచ్చిందని సమాచారం. కాజల్‌ అయితే తెలుగు, తమిళంలో చాలా పాపులర్‌ కనుక రెండు భాషల్లోను గ్యారెంటీ రిటర్న్స్‌ వస్తాయని అనుకుంటున్నారు. ఇన్నేళ్ల కెరియర్లో ఇంతవరకు కాజల్‌ ఒక్క లేడీ ఓరియెంటెడ్‌ సినిమా కూడా చేయకపోవడంతో ఆమె కూడా దీనికి ఓకే చెబుతుందని అనుకుంటున్నారు.

రెండు భాషలకి కలిపి ఆకర్షణీయమైన ఆఫర్‌నే కాజల్‌కి ఇచ్చారట. తమన్నా కంటే కాజల్‌ బెటర్‌ ఆప్షన్‌ అని తమన్నాకి ఆఫర్‌ చేసిన దానికంటే ఎక్కువే ఇస్తామంటున్నారట. కాజల్‌ ఇంకా దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు కానీ ఆమె ఓకే చెప్పే అవకాశముందని అంటున్నారు.

కన్నడ వెర్షన్‌కి మాత్రం అక్కడ పాపులర్‌ అయిన నటి ఎవరైనా అయితే మంచిదని చూస్తున్నారని, లీసా హేడెన్‌ పాత్రకి అమీ జాక్సన్‌ని తీసుకోవాలని అనుకుంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు