బాకీలు తీర్చేస్తున్న కాజల్

బాకీలు తీర్చేస్తున్న కాజల్

సినిమా ఫీల్డులో 'గ్రాటిట్యూడ్' అనే పదానికి విలువ ఇచ్చేవాళ్లు తక్కువమందే ఉంటారు. తాము ఓ స్థాయి అందుకున్నాక అంతకుముందు తమకు లైఫ్ ఇచ్చిన వాళ్లను పట్టించుకునే వాళ్లు తక్కువమందే ఉంటారు. ఇందుకు కాజల్ అగర్వాల్ మినహాయింపనే చెప్పాలి.

స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్నాక కూడా తనకు మొదట్లో అవకాశాలు ఇచ్చిన వాళ్లను ఆమె మరిచిపోలేదు. 'చందమామ' సినిమాతో తన కెరీర్‌ను మార్చేసిన కృష్ణవంశీతో మళ్లీ 'గోవిందుడు అందరివాడేలే' చేసింది. ఆ తర్వాత 'లక్ష్మీకళ్యాణం' ద్వారా తనకు తొలి అవకాశాన్నిచ్చిన తేజతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా చేస్తోంది.

కొత్త హీరోయిన్ అయిన తనతో కలిసి నటించేందుకు అంగీకరించిన కళ్యాణ్ రామ్ తో కూడా ఇప్పుడు కాజల్ మళ్లీ జత కడుతోంది. కాజల్ ఇప్పుడున్న రేంజికి కళ్యాణ్ రామ్ సినిమాకు ఓకే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆమె అతడితో జత కట్టడానికి అభ్యంతరం చెప్పలేదు. మొత్తానికి కెరీర్ ఆరంభంలో తనను ఎంకరేజ్ చేసిన వాళ్లతో మళ్లీ సినిమాలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది చందమామ.

మధ్యలో కెరీర్ కొంచెం డౌన్ అయినప్పటికీ కాజల్ కు ఇప్పటికీ డిమాండేమీ తగ్గలేదు. తమిళంలో అజిత్ లాంటి సూపర్ స్టార్ సరసన నటిస్తోంది కాజల్. తెలుగులోనూ ఇంకో రెండు పెద్ద సినిమాలకు ఆమె పేరును పరిశీలిస్తున్నారట. 'నేనే రాజు నేనే మంత్రి' జులైలోనే ప్రేక్షకుల ముందుకు రానుండగా.. కళ్యాణ్ రామ్ సినిమా ఆల్రెడీ సెట్స్ మీదికి వెళ్లిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు