గోపీచంద్ 'బుల్లెట్'.. విడుదలవుతుందా?

గోపీచంద్ 'బుల్లెట్'.. విడుదలవుతుందా?

పాపం గోపీచంద్.. ఈ మధ్య అతడి సినిమాలకు వరుసగా ఏదో ఒక ఆటంకం ఎదురవుతోంది. వాటిని ఎలాగోలా బయటపడేద్దామని అతను విశ్వప్రయత్నాలు చేస్తున్నా.. పని సాఫీగా అవ్వట్లేదు. ఎప్పుడో నాలుగేళ్ల కిందట మొదలైన ఓ సినిమాకు దర్శకుడిని మార్చి.. నిర్మాతను మార్చి.. చివరికి పేరు కూడా మార్చి 'ఆరడుగుల బుల్లెట్' పేరుతో విడుదల చేయడానికి గోపీచంద్ ఎంతగానో శ్రమించాడు.

చివరికి సినిమా విడుదలకు సిద్ధమైంది. పత్రికల్లో ప్రకటనలు వచ్చాయి. బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇంతలో ఈ సినిమా విడుదలను ఆపాలంటూ సహదేవ్ అనే ఎన్నారై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చిత్ర బృందంలో ఆందోళన రేకెత్తిస్తోంది.

'ఆరడుగుల బుల్లెట్' సినిమా కోసమని సి.కళ్యాణ్, తాండ్ర రమేష్ తన దగ్గర రూ.6 కోట్ల ఫైనాన్స్ తీర్చుకున్నారని.. ఆ డబ్బుల సంగతి తేల్చకుండానే సినిమాను రిలీజ్ చేస్తున్నారని.. తనకు న్యాయం చేయాలని సహదేవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 'ఆరడుగుల బుల్లెట్'కు పీవీపీ రుణం సమకూర్చి సినిమాను బయటికి తీసుకొస్తున్నట్లుగా ఈ మధ్య వార్తలొచ్చాయి. మరి ఈ సహదేవ్ సంగతేంటో తెలియాలి.

అతను సినిమా మొదలైనపుడు రుణం ఇచ్చిన వ్యక్తేమో. మామూలుగా ఫైనాన్స్ వ్యవహారాలు సెటిల్ చేశాకే రిలీజ్ సంగతి చూసుకుంటారు. ఐతే 'ఆరడుగుల బుల్లెట్'కు ఖర్చు ఎక్కువ.. రాబడి తక్కువ అన్నట్లయింది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ సినిమా శుక్రవారం సజావుగా విడుదలవుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. గోపీ మరో సినిమా 'ఆక్సిజన్'కు కూడా రకరకాల ఇబ్బందులతో విడుదలకు నోచుకోవట్లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English