విప్పుకు తిరిగితే చూడరు మేడమ్‌!

విప్పుకు తిరిగితే చూడరు మేడమ్‌!

హాలీవుడ్‌ టెలివిజన్‌ సిరీస్‌ నుంచి సినిమాకి ప్రమోషన్‌ పొందిన ప్రియాంక చోప్రా లాబీయింగ్‌ చేసుకుని 'ఇంటర్నేషనల్‌ ఐకాన్‌' అంటూ అవార్డులు కూడా అందుకుంది. ఎలాగైనా 'బేవాచ్‌' చిత్రంతో హిట్‌ కొట్టేందుకు ప్రియాంక చేయని ప్రయత్నం లేదు. సినిమాకి ప్రచారం కోసమని బికినీల్లో తిరుగుతూ అదే పనిగా వార్తల్లో నానింది. అయితే ప్రియాంక ఎంత ఫ్రీ షో ఇచ్చినా కానీ బేవాచ్‌ చిత్రానికి అది హెల్ప్‌ కాలేదు. బేవాచ్‌ హాలీవుడ్‌లో ఫ్లాప్‌ అయింది. ఇండియాలో ప్రియాంక వల్ల వసూళ్లు వచ్చేస్తాయని భావించారు కానీ గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన లేదు.

ప్రియాంక బికినీ షో చూసేందుకు ఉత్సాహం చూపించని యువత 'వండర్‌ వుమన్‌'ని చూసేందుకు ఎగబడుతున్నారు. కథలో దమ్ము వుండి, సినిమా నిండా వినోదం వుండాలే కానీ ఎక్స్‌పోజింగ్‌ వున్నా లేకున్నా పట్టించుకోమని చాటుకుంటున్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ నుంచి అయినా పాఠాలు నేర్చుకుని ఇకపై ఇలాంటి స్కిన్‌ షోలు వదిలేసి నటిగా తనకి పేరు తెచ్చే పాత్రల మీద ప్రియాంక దృష్టి పెట్టాలి. బాలీవుడ్‌లో గొప్ప నటి అనిపించుకున్న తనకి హాలీవుడ్‌లో ఇలా ఎక్స్‌పోజింగ్‌ చేసుకుని అవకాశలు రాబట్టుకునే ఖర్మ దేనికి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు