ఆ రెండింటిని ట‌చ్ చేస్తే క‌స్సుమంటున్న శ్రీదేవి

ఆ రెండింటిని ట‌చ్ చేస్తే క‌స్సుమంటున్న శ్రీదేవి

వ‌య‌సు మీద ప‌డ్డా.. త‌ర‌గ‌ని అందాల‌తో గిలిగింతులు పెట్టేస్తుంది అతిలోక సుంద‌రి ట్యాగ్ తో ఉన్న శ్రీదేవి. తాజాగా ఆమె న‌టించిన మామ్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. సినిమా కోసం ఎంత కష్ట‌ప‌డ్డా.. చిత్ర ప్ర‌చారం విష‌యంలోనూ అంతే శ్ర‌ద్ధ‌ను చూపించాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో.. మామ్ చిత్ర ప్ర‌చారం కోసం శ్రీదేవి తెగ క‌ష్ట‌ప‌డిపోతోంది. అదే ప‌నిగా మీడియా ముందుకు వ‌స్తూ.. త‌న సినిమాకు సంబంధించిన విశేషాలు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అయితే.. శ్రీదేవి ఊహించ‌ని రీతిలో ఆమెను రెండు అంశాలు ఇబ్బంది పెట్ట‌ట‌మే కాదు.. ఇరిటేట్ చేస్తున్నాయి కూడా. శ్రీదేవి ఎక్క‌డికి వెళ్లినా.. ఆమె న‌టించిన మామ్ సినిమా గురించి ప్ర‌శ్న‌లు వేయ‌కుండా.. బాహుబ‌లిలో శివ‌గామి క్యారెక్ట‌ర్ ఎందుకు చేయ‌లేద‌న్న ప్ర‌శ్న‌.. కూతుళ్ల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు వేయ‌టంపై అతిలోక సుంద‌రికి ఆగ్ర‌హం వ‌చ్చేస్తోంది.

తాజాగా మామ్ ట్రైల‌ర్ విడుద‌ల కార్య‌క్ర‌మం ముంబ‌యిలో జ‌రిగింది. దీనికి కూతుళ్ల‌తో క‌లిసి ఆమె హాజ‌ర‌య్యారు. ఫోటోగ్రాఫ‌ర్లు శ్రీదేవిని వ‌దిలేసి.. కూతుళ్ల ఫోటోలు తీయ‌టం.. మీడియా ప్ర‌తినిధులు.. మామ్ మూవీ గురించి వ‌దిలేసి.. కూతుళ్ల ఎంట్రీకి సంబంధించిన ప్ర‌శ్న‌లు వేయ‌టం.. ఆమెకు ఒళ్లు మండేలా చేసింది.

మీడియాను క‌లుస్తున్న‌ది కూతుళ్ల గురించి చెప్పేందుకు కాద‌ని.. మామ్ సినిమా కోస‌మంటూ బ‌ర‌స్ట్ అయిపోయింది. తాను ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప్ర‌శ్న‌లు వేయాలని కోరింది. శ్రీదేవి య‌వ్వారం చూస్తుంటే.. మీడియా ఏమేం ప్ర‌శ్న‌లు వేయాల‌న్న‌ది కూడా ఆమె డిసైడ్ చేసేట‌ట్టు ఉన్నారే. మ‌రి.. మామ్ ప్ర‌మోష‌న్  కోసం వ‌చ్చిన‌ప్పుడు ఈ మామ్ రాకుండా.. కూతుళ్ల‌ను ఎందుకు వెంటబెట్టుకొని వ‌చ్చిన‌ట్లో? అంటూ మీడియా  వాళ్లకు వ‌చ్చిన డౌట్ వింటే అతిలోక సుంద‌రికి ఎంత కాలిపోతుందో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English