అప్పు తీర్చకపోతే తెలంగాణకు కరెంట్ కట్ చేస్తామన్న ఏపీ

అప్పు తీర్చకపోతే తెలంగాణకు కరెంట్ కట్ చేస్తామన్న ఏపీ


ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల కాలంలో ప్రత్యక్ష యుద్ధాలు తగ్గాయి. అయితే.. తాజాగా మరో యుద్దానికి రెండు రాష్ర్టాలు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆ యుద్ధానికి ఏపీ విద్యుత్ శాఖ సమరభేరి మోగించడంతో వార్ తప్పదని తేలిపోయింది.

ఇంతకీ విషయం ఏంటంటే...  తెలంగాణ రాష్ట్రానికి నేటి నుంచి కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.  ఈ మేరకు తెలంగాణ   ట్రాన్స్ కో అధికారులకు లేఖ రాస్తూ, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ డిమాండ్ చేసింది. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ ను సరఫరా చేస్తామని జెన్ కో  స్పష్టం చేసింది.

కాగా తెలంగాణ నుంచి రూ, 4,449 కోట్ల బకాయి రావాల్సి ఉందని... ఆ మొత్తం చెల్లించడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది.  బకాయిలు చెల్లించేంత వరకూ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి వుంది.

కాగా తెలంగాణ ధనిక రాష్ర్టమంటూ సీఎం కేసీఆర్ పదేపదే వల్లెవేస్తున్నారు. అలాంటప్పుడు ఈ బకాయిలు చెల్లించలేకపోవడం ఏమిటో అర్థం కావడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ఎలా ఉన్నా ఈ బకాయిల లెక్కలకు తెలంగాణ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో... అసలు ఇస్తానంటుందో ఇవ్వనంటుందో ఇది రెండు రాష్ర్టాల మధ్య ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు