రౌండ్‌ ఫిగర్‌పై కన్నేసిన రాజమౌళి అండ్‌ కో

రౌండ్‌ ఫిగర్‌పై కన్నేసిన రాజమౌళి అండ్‌ కో

'బాహుబలి 2' ఆరవ వారంలోకి ఎంటర్‌ అయినా కానీ ఇంకా స్టడీగా షేర్లు రాబట్టుకుంటోంది. నాలుగు వారాల తర్వాత ఇక షేర్లు రావని ట్రేడ్‌ అనుకుంటే, ఇప్పటికీ ఈ చిత్రం కాస్తో కూస్తో షేర్‌ తెచ్చుకుంటూ లాభం మీదే నడుస్తోంది. అయితే ఈ చిత్రం రన్‌ అయితే చివరి దశకి చేరుకుంది. పదిహేడు వందల కోట్ల గ్రాస్‌ కలక్షన్లకి దగ్గర్లో ఈ చిత్రం రన్‌ ముగుస్తుందని అంచనాలున్నాయి.

అయితే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల కోట్ల గ్రాస్‌ సాధించిన సినిమాగా నిలబెట్టడానికి ఆస్కారముందని రాజమౌళి బృందం ఆశ పడుతోంది. చైనాలో ఇంకా రిలీజ్‌ కాకపోవడంతో, అక్కడినుంచి మూడు వందల కోట్ల గ్రాస్‌ అయినా రాబట్టవచ్చునని నిర్మాతలు భావిస్తున్నారు. దంగ‌ల్‌ అక్కడ పదకొండు వందల కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించి ఇంకా మంచి వసూళ్లతో రన్‌ అవుతోంది. ఆ సినిమా స్థాయిలో ఆడకపోయినా, చైనాలో బాహుబలి 2 అందులో నాలుగో వంతు ఆడినా కానీ రెండు వేల కోట్ల మార్కు దాటించవచ్చునని అనుకుంటున్నారు.

మొదటి భాగం చైనాలో ఫ్లాప్‌ అవడంతో రెండవ భాగంపై ఎవరికీ ఎక్కువ అంచనాలు లేవు. కానీ ఏదో విధంగా దీనికి క్రేజ్‌ తీసుకొచ్చి చైనాలోను బాహుబలి ముద్ర వేయాలని రాజమౌళి అండ్‌ కో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అన్నట్టు చైనాలో మరో ముప్పయ్‌ రోజులు ఎక్కువ ప్రదర్శించే పర్మిషన్‌ తెచ్చుకున్న దంగల్‌ చైనా వసూళ్ల సాయంతోనే రెండు వేల కోట్ల గ్రాస్‌ వసూళ్లని రీచ్‌ అయ్యేలాగుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు