తప్పు తెలుసుకున్న సునీల్‌

తప్పు తెలుసుకున్న సునీల్‌

కమెడియన్‌ నుంచి హీరోగా ఎదిగిన సునీల్‌ ప్రస్తుతానికి హీరోగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే హీరో అనిపించుకునే ప్రాసెస్‌లో సిక్స్‌ ప్యాక్‌ బాడీ కోసం ట్రై చేసి బాగా సన్నబడిపోయి, ముఖంలో కళ మొత్తం కోల్పోయిన సునీల్‌ తనకి వచ్చిన బ్యాడ్‌ ఫీడ్‌బ్యాక్‌ నుంచి తప్పు తెలుసుకున్నాడు. మునుపటిలో ఎక్ససివ్‌గా ఎక్సర్‌సైజులు చేసేస్తూ మరింత సన్నబడిపోకుండా, కాస్త కండ పట్టాడు. వర్కవుట్స్‌ తగ్గించి సునీల్‌ ఇప్పుడు తిరిగి 'మర్యాద రామన్న' సినిమాలో కనిపించిన రూపానికి వచ్చాడు. మిస్టర్‌ పెళ్లికొడుకు, తడాఖా చిత్రాల్లో చాలా బ్యాడ్‌గా కనిపించిన సునీల్‌ తన తదుపరి చిత్రంలో మాత్రం బెటర్‌గా కనిపించబోతున్నాడు. మిస్టర్‌ పెళ్లికొడుకు ఫ్లాప్‌ అయినా కానీ తడాఖా విజయంలో తన వంతు పాత్ర పోషించి, ఆ సినిమా సక్సెస్‌లో క్రెడిట్‌ సొంతం చేసుకున్న సునీల్‌ ప్రస్తుతం నాలుగైదు చిత్రాలకి కమిట్‌ అయ్యాడు.

వేగంగా సినిమాలు చేసేసి తనకున్న క్రేజ్‌ పాడు చేసుకోకుండా, స్లో అండ్‌ స్టడీగా చేసుకుంటూ హీరోగా తనకి ఉన్న డిమాండ్‌ పడిపోకుండా జాగ్రత్త పడుతున్నాడు. త్వరలోనే సునీల్‌ హీరోగా ఒక స్టార్‌ డైరెక్టర్‌ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనుందట. ఆ సినిమా గురించి సునీల్‌ ఇప్పట్నుంచే చాలా ఎక్సయిట్‌ అవుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు