ఇక్కడ పవన్‌, అక్కడ ఆవిడ!

ఇక్కడ పవన్‌, అక్కడ ఆవిడ!

ఒక్కసారి ఒక దర్శకుడితో కమిట్‌ అయిన తర్వాత ఇక వారి పనిలో వేలు పెట్టడానికి చాలా మంది హీరోలు ఇష్టపడరు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోతే ప్రాజెక్ట్‌ సమస్యల్లో పడుతుందని ఎలాంటి అనుమానాలున్నా కానీ డైరెక్టర్‌ చెప్పింది చేసుకుపోతుంటారు.

అయితే కొందరు యాక్టర్లు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తమ సొంత క్రియేటివిటీతో దర్శకులకి అడుగడుగునా అడ్డు తగులుతుంటారు. తెలుగునాట ఇలా దర్శకుల పనిలో జోక్యం చేసుకుంటాడని పవన్‌కళ్యాణ్‌కి చెడ్డ పేరుంది. ముఖ్యంగా అనుభవం లేని దర్శకులు, కొత్తవాళ్లతో చేస్తున్నపుడు పవన్‌ ఇంటర్‌ఫియరెన్స్‌ అధికంగా వుంటుందని అంటుంటారు.
త్రివిక్రమ్‌ లాంటి వారితో చేస్తున్నపుడు పవన్‌ వారి పనికి అడ్డు తగలడట కానీ యువ దర్శకులకైతే పవన్‌తో చిన్నపాటి తలనొప్పులు తప్పవంటారు. అచ్చంగా పవన్‌లానే బాలీవుడ్‌లో కంగన రనౌత్‌ బిహేవ్‌ చేస్తోందని, యువ దర్శకులతోనే కాకుండా అనుభవజ్ఞులతో కూడా ఆమె ఒకేలా ప్రవర్తిస్తోందని రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

దర్శకత్వం వైపు అడుగు పెట్టాలని చూస్తోన్న కంగన ఏ సినిమా చేస్తున్నా కానీ షాట్స్‌తో సహా ప్రతి విషయంలోను దర్శకుడికి అడ్డు తగులుతోందట. మణికర్నిక చిత్రానికి క్రిష్‌కి కూడా ఈ ఇబ్బంది తప్పదని చెప్పుకుంటూ వుంటే, క్రిష్‌ మాత్రం తానే కమాండర్‌ అని, కంగన్‌ ఓన్లీ యాక్టర్‌ అని అంటున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు