ఐటీ ఉద్యోగాల‌కంటే...ఇవే బెట‌ర్‌

ఐటీ ఉద్యోగాల‌కంటే...ఇవే బెట‌ర్‌

ఐటీ రంగంలో నెల‌కొన్న అస్త‌వ్య‌స్త్య ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌ముఖ వాణిజ్య మండలి అసోచామ్ ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో స‌మ‌గ్ర విశ్లేష‌ణ చేసింది. భవిష్యత్‌లో నిర్మాణం, రియల్ ఎస్టేట్, సౌందర్యం, ఆరోగ్య సంరక్షణ, సంఘటిత చిల్లర వర్తకం, రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లోనే అధికంగా ఉద్యోగాల కల్పన జరుగనుందని ఓ నివేదిక వెల్లడించింది.

దేశీయ ఐటీ, ఐటీఈఎస్ రంగాలు వచ్చే ఐదేళ్ల‌లో గరిష్ఠంగా 10 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని వాణిజ్య మండలి అసోచామ్, థాట్ ఆర్బిట్రేజ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంయుక్తంగా రూపొందించిన నోట్ వెల్లడించింది.

ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో ఉద్యోగాల కల్పన మందగించిందని పేర్కొంది. 2013నాటికి ఈ రంగంలో 33 లక్షల మంది పనిస్తుండగా.. 2020నాటికి మరో 22 లక్షల మంది అవసరం ఉంది. కానీ గడిచిన 3-4 ఏళ్ల‌లో ఐటీ సెక్టార్ కేవలం పది లక్షల మందికే ఉద్యోగావకాశాలు కల్పించగలిగిందని అసోచామ్ రిపోర్టు తెలిపింది.

ఏటా దేశంలో కనీసం 1.5-2 కోట్ల ఉద్యోగావకాశాలు అవసరం. ఈ నేపథ్యంలో దేశీయంగా, ఎగుమతుల మార్కెట్‌లోనూ వృద్ధి చెందే అవకాశాలున్న ఇతర రంగాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు