విజయ్ దేవరకొండ తండ్రయ్యాడు!

విజయ్ దేవరకొండ తండ్రయ్యాడు!

మొన్నే కదా విజయ్ దేవరకొండ పెళ్లిచూపులని.. పెళ్లికి రెడీ అవుతున్నాడని రూమర్లు వినిపించాయి.. అంతలోనే తండ్రయిపోవడం ఏంటి అంటారా..? ఇది ఎవరో అన్న మాట కాదు.. స్వయంగా విజయే ఈ విషయం చెప్పాడు. తనకు పెళ్లయిపోయిందని.. ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారని అన్నాడు. తన గురించి వస్తున్న రూమర్ల విషయంలో అతను వేసిన సెటైర్లివి.

తాను లండన్ వెళ్లి.. అక్కడి నుంచి ఫ్లైట్లో ఇండియాకు వచ్చే లోపు తన పెళ్లి గురించి ఇష్టానుసారం రూమర్లు పుట్టించేశారని అతనన్నాడు. ఇది టూమచ్ అంటూ అతను సెటైర్లు వేశాడు. తన గురించి వస్తున్న రూమర్లపై అతను ఫేస్ బుక్‌లో స్పందించాడు.

‘‘14 గంటలు ఫ్లైట్లో ఉంటే.. ఇండియాలో నా పెళ్లి చేస్తున్నారంట. నా ఇద్దరు కొడుకులు రమ్మీ, డమ్మీ. ప్రెస్ వాళ్లు నా భార్య విమ్మీ పేరు ప్రస్తావించడం మరిచిపోయారు. నాకు విషెస్ చెప్పిన వాళ్లకు ధన్యవాదాలు. ఫన్నీ గాసిప్’’ అంటూ తన పెళ్లి గురించి వస్తున్న రూమర్లను సెటైరిగ్గా ఖండించాడు విజయ్.

సినిమాల్లో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న విజయ్‌కు పెళ్లి అనగానే చాలామంది ఆశ్చర్యపోయారు కానీ.. దీని గురించి ప్రచారం కొంచెం గట్టిగానే జరగడంతో ఈ వార్తలు నిజమేనేమో అనుకున్నారు. విజయ్ నుంచి వెంటనే ఖండనలేమీ కూడా లేకపోవడంతో త్వరలో అతడి పెళ్లి ఖాయం అనుకున్నారు. కానీ ఈ ప్రచారం ఊపందుకోకముందే విజయ్ స్పందించాడు. ప్రస్తుతం విజయ్ ఖాతాలో అరడజను దాకా సినిమాలుండటం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు