‘దంగల్’ రూటే ఫాలో అవుతున్న బాహుబలి-2

‘దంగల్’ రూటే ఫాలో అవుతున్న బాహుబలి-2

ఇండియన్ సినిమాకు కొత్త మార్కెట్ దారులు చూపించింది ‘దంగల్’. భారతీయ సినిమాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో హవా సాగిస్తున్నప్పటికీ చైనా మార్కెట్‌ను ఛేదించడం మాత్రం కష్టంగానే ఉంటోంది.

ఐతే 3 ఇడియట్స్, పీకే లాంటి సినిమాలతో తెచ్చుకున్న గుర్తింపు అమీర్ ఖాన్‌కు కలిసొచ్చి.. అతడి కొత్త సినిమా ‘దంగల్’ చైనాలో మంచి అంచనాల మధ్య, కొంచెం పెద్ద స్థాయిలోనే విడుదలైంది. ఆ సినిమా అక్కడ అంచనాల్ని మించిపోయి అద్భుత విజయం సాధించింది. ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విస్మయపరిచింది.

ఇంతకుముందు ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను కూడా చైనాలో పెద్ద ఎత్తనే విడుదల చేశారు కానీ.. ఆశించిన ఫలితం దక్కలేదు. ఇండియాలో విడుదలైన ఏడాది తర్వాత చైనాలో రిలీజ్ చేయడం.. డిస్ట్రిబ్యూషన్ విషయంలో తేడా జరగడంతో ‘బాహుబలి’ని చైనీయులు పట్టించుకోలేదని చెప్పుకున్నాడు నిర్మాత.

ఐతే ఇప్పుడు ‘బాహుబలి-2’ విషయంలో మాత్రం ఎలాంటి తేడా జరగకుండా చూడాలని, జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. ‘దంగల్’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘ఈ స్టార్ ఫిలిమ్స్’ సంస్థకే బాహుబలి-2 బాధ్యతల్ని అప్పగించారట. ఆ సంస్థ మంచి టైమింగ్ చూసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ముందు ప్రమోషన్ గట్టిగానే చేయాలని చూస్తున్నారు. చైనాలో 6500 థియేటర్లలో బాహుబలి-2 విడుదలయ్యే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు