బాహుబలి గురించి ఇప్పుడెందుకు?: శ్రీదేవి

బాహుబలి గురించి ఇప్పుడెందుకు?: శ్రీదేవి

'బాహుబలి' చిత్రంలో 'శివగామి' పాత్ర శ్రీదేవికి ఆఫర్‌ చేసానని, అయితే ఆమె మరీ ఎక్కువ డిమాండ్‌ చేయడంతో ఆ పాత్ర రమ్యకృష్ణతో చేయించామని, ఒక విధంగా శ్రీదేవి చేయకపోవడం అదృష్టమని రాజమౌళి వ్యాఖ్యానించాడు. అంత పెద్ద నటిని గురించి ఇలా మాట్లాడ్డం తగదంటూ రాజమౌళిని విమర్శిస్తున్న వాళ్లూ వున్నారు, శ్రీదేవి మరీ అన్ని డిమాండ్స్‌ చేసి వుండకూడదని అంటున్న వాళ్లూ వున్నారు. అయితే ఈ వ్యవహారంపై శ్రీదేవి స్పందన ఏమిటి? 'మామ్‌' ప్రచారంలో భాగంగా మీడియాని కలిసిన శ్రీదేవిని దీని గురించి అడిగితే ''బాహుబలి వచ్చేసింది. వెళ్లిపోయింది. బాహుబలి 2 కూడా వచ్చేసి బాగా ఆడుతోంది. ఇప్పుడు అందులో నేను వున్నానా లేనా అనే దాని గురించి దేనికి మాట్లాడుకోవడం?'' అంటూ టాపిక్‌ కట్‌ చేసింది. విశేషమేమిటంటే, బాహుబలి చిత్రాన్ని కాదన్న శ్రీదేవి తమిళ చిత్రం 'పులి'లో నటించింది. శ్రీదేవి కోసం ఆ చిత్ర నిర్మాతలు చాలానే వెచ్చించారు.

కానీ సినిమా డిజాస్టర్‌ అవడంతో హిందీ వెర్షన్‌కి శ్రీదేవి ప్లస్‌ అవుతుందని అనుకున్న వారి ఆశలపై నీళ్లు కుమ్మరించినట్టయింది. ఇదిలావుంటే, శ్రీదేవి నటిస్తున్న 'మామ్‌' చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా అనిపిస్తోన్న ఈ చిత్రంలో టైటిల్‌ రోల్‌ శ్రీదేవి పోషించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English