ఇలాగైతే రేంజ్‌ పెరగదు రాజ్‌ తరుణ్‌!

ఇలాగైతే రేంజ్‌ పెరగదు రాజ్‌ తరుణ్‌!

తన డబ్బులు తనకి వచ్చేస్తే, తనతో సినిమా తీసిన వాళ్ల డబ్బులు సేఫ్‌ అయిపోతే చాలన్నట్టు వ్యవహరిస్తున్నాడు రాజ్‌తరుణ్‌. హీరోగా సక్సెస్‌ అయిన రాజ్‌ తరుణ్‌ ఇన్నేళ్లలో ఒకే రేంజ్‌కి పరిమితం అయిపోయాడు. థర్డ్‌ టయర్‌ హీరోల్లో వున్నాడే తప్ప కనీసం సెకండ్‌ టయర్‌ హీరోల స్థాయికి వెళదామని ప్రయత్నించడం లేదు. సమస్య ఏమిటంటే, హీరో రేంజ్‌ పెరగనంత కాలం ఎన్ని సక్సెస్‌లు వచ్చినా లాభం వుండదు. ఎందుకంటే మధ్యలో ఒక రెండు సినిమాలు తేడా అయితే తమ మార్కెట్‌ ధడేల్న పడిపోతుంది.

అదే సక్సెస్‌లో వున్నపుడే నెక్స్‌ట్‌ లెవల్‌కి వెళ్లేలా చూసుకుంటే, ప్రతి సినిమాతో రేంజ్‌ పెరగడమే కాకుండా ఇండస్ట్రీలో తమ స్థానం కూడా పటిష్టమవుతుంది. నాని, శర్వానంద్‌ అందుకే దర్శకులు లేదా నిర్మాతలు బలంగా వుండేట్టు చూసుకుంటారు. నాని, శర్వానంద్‌ చిత్రాల్లో లో క్వాలిటీ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ వుండవు. కానీ రాజ్‌ తరుణ్‌ చిత్రాల్లో చాలా వరకు లో బడ్జెట్‌ సినిమాలని తలపిస్తాయి. ఏదో ఎంటర్‌టైన్‌మెంట్‌తో నెట్టుకొచ్చేద్దామని చూస్తున్నాడే తప్ప  'కుమారి 21 ఎఫ్‌' తర్వాత మళ్లీ ప్రయోగానికి వెళ్లలేదు.

'అంధగాడు'లో బ్లయిండ్‌ క్యారెక్టర్‌ చేసినప్పటికీ అది కాసేపు మాత్రమే. ఇలాంటి సినిమాల వల్ల నటుడిగా తనకి వచ్చే ప్రత్యేక గుర్తింపు వుండదు. పేరున్న దర్శకులతో, పెద్ద బ్యానర్లతో చేయడం మీద రాజ్‌ తరుణ్‌ దృష్టి పెట్టాలి. తన వెనుక గాడ్‌ఫాదర్లు ఎవరూ లేరు కనుక సక్సెస్‌లో వున్నప్పుడే పాతుకుపోవడం మీద కాన్సన్‌ట్రేట్‌ చేయాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English