తమన్నా అదరగొట్టింది.. మరి లావణ్య?

తమన్నా అదరగొట్టింది.. మరి లావణ్య?

మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్లో ది బెస్ట్ క్యారెక్టర్ల లిస్టు తీస్తే అందులో ‘100 పర్సంట్ లవ్’లోని మహాలక్ష్మి పాత్ర తప్పకుండా ఉంటుంది. కెరీర్ ఆరంభంలో తమన్నాకు మంచి పేరు తెచ్చి పెట్టిన క్యారెక్టర్లలో ఇది ఒకటి. తెలుగులో ఈ సినిమా తర్వాతే తమన్నా కెరీర్ బాగా ఊపందుకుంది. మామూలుగా తెలుగు సినిమాల్లో హీరోయిన్లకు అంత మంచి పాత్రలు దొరకడం అరుదు.

అంత బాగా తమన్నా పాత్రను డిజైన్ చేశాడు సుకుమార్. ఇప్పుడీ స్పెషల్ క్యారెక్టరే లావణ్య త్రిపాటి చేయబోతుండటం విశేషం. ‘100 పర్సంట్ లవ్’ సినిమాను తమిళంలో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అందులో హీరోయిన్‌గా లావణ్యను ఎంపిక చేసుకున్నారు.

ముందు ఈ పాత్రకు తమన్నానే తీసుకోవాలనుకున్నారు. కానీ కుదర్లేదు. తర్వాత కొన్ని ఆప్షన్లు పరిశీలించి చివరికి లావణ్యకు ఓటేశారు. లావణ్య ఇప్పటికే సందీప్ కిషన్ సరసన తమిళంలో ‘మాయవన్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా విడుదలకు రెడీ అవుతున్న టైంలోనే ‘100 పర్సంట్ లవ్’ రీమేక్‌లో ఛాన్స్ పట్టేసింది. ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.

సుకుమార్ శిష్యుడైన చంద్రమౌళి ఈ రీమేక్‌కు దర్శకత్వం వహించనున్నాడు. ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరి తమన్నా అదరగొట్టిన పాత్రలో లావణ్య ఎలా మెప్పిస్తుందో.. ఈ పాత్ర ఆమెకెలాంటి పేరు తెచ్చి పెడుతుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు