నాగబాబు కూడా కారణమే అన్న వర్మ

నాగబాబు కూడా కారణమే అన్న వర్మ

రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ నుంచి ఎందుకు వెళ్లిపోయాడు..? ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న. దీనికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. టైగర్ ష్రాఫ్ గురించి రామ్ గోపాల్ వర్మ ప్రేలాపనలన్నింటినీ రికార్డు చేసి విద్యుత్ జమాల్ సోషల్ మీడియాలో లీక్ చేయడమే వర్మ ట్విట్టర్ నుంచి వెళ్లిపోయేలా చేసిందని కొందరంటే.. వర్మకు బోర్ కొట్టి వెళ్లిపోయాడని ఇంకొందరన్నారు. ఇంకొందరు పవన్ కళ్యాణ్.. చిరంజీవిలపై విమర్శలు.. నాగబాబుతో గొడవ తర్వాత వర్మకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తి ట్విట్టర్ నుంచి నిష్క్రమించారన్నారు. మరి ఇంతకీ ఈ విషయంలో వర్మ వివరణ ఏంటో చూద్దాం పదండి.

‘‘నేను ట్విట్టర్‌కు వచ్చింది కొందరిని ఇరిటేట్ చేద్దామని. అలా జనాల్ని ఇరిటేట్ చేయడం నాకిష్టం. ఐతే ఇన్నేళ్లలో నేను ఇరిటేట్ చేయాలనుకున్న వాళ్లందరినీ చేసేశాను. ఇప్పుడు ఆ వ్యక్తుల్ని ఇరిటేట్ చేయడంలో బోర్ కొట్టేసింది. అలాగే నా మీద నాకూ బోర్ కొట్టేసింది. అందుకే ట్విట్టర్ వదిలేశాను. తిరిగి మళ్లీ ట్విట్టర్‌కు వెళ్లే ఉద్దేశం ఎంతమాత్రం లేదు. ట్విట్టర్లో నేను నాగబాబును తిట్టిపోయడం.. పవన్ కళ్యాణ్‌ మీద విమర్శలు చేయడంపై రిగ్రెట్ అవుతున్నా. ఇది నిజాయితీగా చెబుతున్న మాట. నేనప్పుడు అపరిపక్వంగా వ్యవహరించాను. నన్ను జనాలు ట్రోల్ చేయొచ్చు. నా మీద నేనే సెటైర్లు వేసుకోవచ్చు. అలా అని నాకు ఎవరినీ హర్ట్ చేసే హక్కు లేదు. ఈ విషయంలో నిజాయితీగా నేను హర్ట్ చేసిన వాళ్లందరికీ సారీ చెబుతున్నా. నేను ట్విట్టర్ నుంచి వెళ్లిపోవడానికి నాగబాబుతో గొడవ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. నా చేతికి ‘ఇన్‌స్టాగ్రామ్’ రూపంలో మరో బొమ్మ దొరికింది. ఇక దాంతో ఆడుకుంటా. ఐతే ఇక్కడంతా ఫొటోలు, వీడియోల రూపంలోనే ఉంటుంది కాబట్టి.. ట్విట్టర్లో మాదిరి ఇక్కడ ప్రేలాపనలు చేయడానికి అవకాశం ఉండదనే అనుకుంటా. ఐతే అవకాశమున్నప్పటికీ ఇంతకుముందులాగా ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి హర్ట్ చేయాలనుకోవట్లేదు’’ అని వర్మ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు