మిలియన్ వ్యూస్.. ఇక మానేస్తే బెటరేమో

మిలియన్ వ్యూస్.. ఇక మానేస్తే బెటరేమో

ఇంతకుముందు తమ అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి 50 డేస్ సెంటర్ల గురించి.. 100 రోజుల సెంటర్ల గురించి మాట్లాడుకునేవాళ్లు. ఆ తర్వాత కలెక్షన్ల రికార్డులు ప్రామాణికం అయ్యాయి. ఐతే ఇప్పుడు కలెక్షన్ల కంటే ముందు యూట్యూబ్ వ్యూస్.. లైక్స్ రికార్డుల గొడవ పెద్దదైపోతోంది. రెండు గంటల్లోనే మిలియన్ వ్యూస్.. ఒక్క రోజులో 5 మిలియన్ వ్యూస్.. ఫాస్టెస్ట్ 1 ల్యాక్ లైక్స్.. ఇలాంటి మాటలు ఈ మధ్య జనాల్ని మరీ విసుగెత్తించేస్తున్నాయి.

మన దగ్గర ఫ్లాప్ అయిన.. యావరేజ్‌గా ఆడిన సినిమాలు హిందీలో డబ్ అయితే వాటికి మిలియన్ల కొద్దీ యూట్యూబ్ వ్యూస్ వస్తుండటం గమనించవచ్చు. ఇవన్నీ చూశాక ఈ వ్యూస్.. లైక్స్ విషయంలో ఆసక్తి క్రమంగా తగ్గిపోతోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంటర్నెట్ విస్తృతం అయింది. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. అందులో ఇంటర్నెట్ ఉంటోంది. జియో పుణ్యమా అని కొన్ని నెలల పాటు ఫ్రీ ఇంటర్నెట్.. ఇప్పుడు మిగతా కంపెనీలు కూడా ఫ్రీగా.. తక్కువ ధరకు ఇంటర్నెట్ ఇస్తున్నాయి. దీంతో ఫస్ట్ లుక్ వచ్చినా.. టీజర్ వచ్చినా.. సినిమాలకు సంబంధించి ఏ చిన్న విశేషం బయటికి వచ్చినా జనాలు ఓ లుక్ వేసేస్తున్నారు.

ఇంతకుముందు మిలియన్ మార్క్ అంటే పెద్ద హీరోలకు మాత్రమే సాధ్యమయ్యే మైలురాయిలా ఉండేది. కానీ ఇప్పుడు చిన్నా చితకా హీరోలు కూడా ఈ మార్కును టచ్ చేస్తున్నారు. మరోవైపు ఈ వ్యూస్.. లైక్స్ విషయంలో పెద్ద గోల్ మాల్ నడుస్తోందని.. ఇలాంటివి మ్యానుపులేట్ చేయడానికి కొన్ని టీమ్స్ పని చేస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అన్ని రకాలుగా ఈ వ్యూస్.. లైక్స్ విషయంలో ఇంతకుముందున్న ఆసక్తి లేదు.. వాటికంత విలువా లేదు.. క్రెడిబిలిటీ కూడా లేదు. కాబట్టి ఇకపై ఈ వ్యూస్.. లైక్స్ విషయంలో మరీ ఎగ్జైట్ కావాల్సిన అవసరం లేదేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు