స్పైడర్‌ ఇలాగుంటే అక్కడెలా సర్‌?

స్పైడర్‌ ఇలాగుంటే అక్కడెలా సర్‌?

మహేష్‌ 'స్పైడర్‌' ఫస్ట్‌ లుక్‌ చూసిన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. స్టయిలిష్‌గా వుండడమే కాకుండా, టెక్నికల్‌గా చాలా ఉన్నత శ్రేణిలో వుంటుందని ఈ టీజర్‌లో చిన్న మెరుపు చూపించాడు మురుగదాస్‌. మహేష్‌ ఎప్పటిలా అందంగా, స్టయిలిష్‌గా వున్నాడు.

ఈ సినిమాలో ఏదో వుంటుందనే ఉత్సుకతని రేకెత్తించిన ఈ టీజర్‌ చిన్నపాటి అనుమానాలని కూడా కలిగించింది. ముఖ్యంగా ఈ చిత్రం మాస్‌ని ఆకట్టుకుంటుందా అనే డౌట్‌ చాలా మందికి వస్తోంది. ఎంత కాదన్నా మన సినిమాలు మాస్‌ జనాలకి రీచ్‌ కాకపోతే క్లిక్‌ అవడం కష్టం. టైటిల్‌ దగ్గర్నుంచి టీజర్‌ వరకు అన్నిట్లోను స్టయిల్‌ మెయింటైన్‌ చేస్తోన్న ఈ చిత్రం పూర్తిగా మాస్‌ని విస్మరించినట్టు కనిపిస్తోంది. టైటిల్‌ లోగో కూడా ఇంగ్లీష్‌లోనే డిజైన్‌ చేసారు తప్ప తెలుగు లోగో ఇంతవరకు రిలీజ్‌ చేయలేదు.

అన్ని భాషల్లోను ఇదే టైటిల్‌ వుంటుంది కనుక సింగిల్‌ లోగో మెయింటైన్‌ చేయాలని భావిస్తున్నారు. కానీ మాస్‌ డామినేషన్‌ ఎక్కువగా వుండే ఏరియాల సంగతేంటి? సీడెడ్‌, ఆంధ్ర, నైజాంలోని బి, సి సెంటర్స్‌ని దృష్టిలో పెట్టుకోకపోతే ఎలా అంటూ ట్రేడ్‌ వర్గాలు సందేహాలు రైజ్‌ చేస్తున్నాయి. మురుగదాస్‌ చిత్రాల్లో మాస్‌ హీరోయిజంకి లోటు వుండదు కనుక టైటిల్‌లో, టీజర్‌లో లేకపోయినా ఆ అంశాలన్నీ సినిమాలో కవర్‌ అవుతాయనే నమ్మాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు