దాసరిపై వాళ్ల లేఖలు కదిలించేశాయ్..

దాసరిపై వాళ్ల లేఖలు కదిలించేశాయ్..

దర్శక రత్న దాసరి నారాయణరావుపై ఎవరి స్థాయిలో వాళ్లు బాగానే స్పందించారు. ముందుగా క్రిష్ ట్విట్టర్లో పెట్టిన లేఖకు జనాల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఎమోషనల్‌గా ఆ లేఖ నెటిజన్లను టచ్ చేసింది. దాసరి గుండె ఆడకపోయినా.. ఆయన సినిమాలు ఆడుతూనే ఉంటాయని.. ప్రపంచంలో సినిమా అన్నది ఉన్నంత కాలం దాసరి ఉంటారని.. పెద్దాయన విశ్రాంతి తీసుకుంటున్నారని.. ఇలాంటి ఎమోషనల్ లైన్స్‌తో టచ్ చేశాడు క్రిష్.

ఇక ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లేఖ కూడా స్టాండ్ ఔట్‌గా నిలిచింది. ''మా దర్శకులందరం ముక్తకంఠంతో 'యాక్షన్' అంటాం.. ప్లీజ్ ఒక్కసారి 'బతుకు' నటించరూ. మీమీదొట్టు.. ఇక మేం 'కట్' చెప్పేదే లేదు.. అప్పటిదాకా ఈ కన్నీళ్లు ఆగేదే లేదు'' అంటూ సుకుమార్ ఈ లేఖను ముగించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

క్రిష్, సుక్కు మాత్రమే కాదు.. 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్' లాంటి సినిమాలతో రచయితగా మంచి పేరు సంపాదించిన యువ రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ సైతం దాసరిని ఉద్దేశించి ఒక చక్కటి ఎమోషనల్ లెటర్ రాశాడు. ''మనకు పాఠాలు ఉంటాయి- గురువు లేడు.. అడవి ఉంటుంది-సింహం లేదు.. ఇల్లు ఉంది-తండ్రి లేడు.. పిడికిలి ఉంది-బలం లేదు.. సమస్యలొస్తే తట్టే తలుపు ఉంది-తీర్చే మనిషి లేడు.. కార్మికులు ఉన్నారు-నాయకుడు లేడు.. మా సినిమాలు వస్తాయి-మీ అభినందనలు లేవు.. మా అభిమానం ఉంది-మీ సినిమాలు లేవు'' అంటూ కదిలించే మాటలు రాశాడు ప్రసన్నకుమార్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు