వర్మకి అతని దెబ్బ గట్టిగానే తగిలింది

వర్మకి అతని దెబ్బ గట్టిగానే తగిలింది

ట్విట్టర్‌ నుంచి సడన్‌గా రాంగోపాల్‌వర్మ ఎందుకు వెళ్లిపోయాడనేది ఎవరికీ అంతు చిక్కలేదు. అంత ఈజీగా గివ్‌ అప్‌ అనే అలవాటు లేని వర్మ తనకి అత్యంత ఇష్టమైన ప్లాట్‌ఫామ్‌ని, అన్ని లక్షల మంది ఫాలోవర్లు వున్న మీడియంని ఎందుకు వదిలేసుకుంటాడు?

అసలే త్వరలో తన వెబ్‌ సిరీస్‌ మొదలవుతున్న దశలో ట్విట్టర్‌నుంచి వచ్చే ట్రాఫిక్‌ వర్మకి చాలా అవసరం. వర్క్‌ మీద దృష్టి పెట్టడానికి ట్విట్టర్‌ వదిలేసానని వర్మ చెప్పుకున్నా కానీ దీని వెనుక వేరే కారణముందని వినిపిస్తోంది. ఎప్పుడూ ఎవరో ఒకరిపై బురద జల్లుతూ, పిచ్చి కామెంట్లు చేసుకుంటూ పొద్దుపుచ్చిన వర్మ ఒక హీరో విషయంలో గీత దాటి మాట్లాడాడు. బాలీవుడ్‌ యువ హీరో టైగర్‌ష్రాఫ్‌ గురించి వర్మ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

విద్యుత్‌ జమావాల్‌కి ఫోన్‌ చేసి, టైగర్‌ ష్రాఫ్‌ గురించి వర్మ చేసిన పిచ్చి ప్రేలాపనని అతను రికార్డ్‌ చేసి మరీ ట్విట్టర్‌లో పెట్టాడు. కనీసం డిఫెండ్‌ చేసుకోవడానికి కూడా లేకుండా విద్యుత్‌ తనని ఇరికించేయడంతో వర్మ షాకయ్యాడు. టైగర్‌ దానికి డైరెక్టుగా రియాక్ట్‌ కాకపోయినప్పటికీ, వెనుక చాలానే చేసాడట. బాలీవుడ్‌ పెద్ద తలకాయలే వర్మకి మొట్టికాయలు వేసారట. అతను ట్వీట్లు ఆపేయాలని డిమాండ్‌ చేసారట.

ఆ ఉదంతం వెంటనే ట్విట్టర్‌నుంచి బయటకి పోతే అనుమానాలు వస్తాయని కాస్త సమయం తీసుకుని వర్మ ఎగ్జిట్‌ అయ్యాడని, వర్మ ట్విట్టర్‌ అకౌంట్‌ డిలీట్‌ చేసుకోవడానికి కారణం మాత్రం టైగర్‌ ష్రాఫ్‌ అని, లేదంటే ఆ ఆడియో ఆధారంగా అతనిపై లా సూట్‌ ఫైల్‌ అయి వుండేదని రూమర్స్‌ వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవమెంత అనేది తెలియదు కానీ వినడానికి నమ్మశక్యంగానే అనిపిస్తోంది కదూ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు