అల్లు అరవింద్‌ని అవాయిడ్‌ చేయడానికే ఇలా చేసాడా?

అల్లు అరవింద్‌ని అవాయిడ్‌ చేయడానికే ఇలా చేసాడా?

రాజమౌళికి కొంతకాలంగా అల్లు క్యాంప్‌ నుంచి కాల్స్‌ మీద కాల్స్‌ వస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తదుపరి చిత్రం ఏ హీరోతో చేయాలనేది అతను ఇంకా ఫిక్స్‌ కాకపోవడంతో అది అల్లు అర్జున్‌తో సెట్‌ చేయించాలని అల్లు అరవింద్‌ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు రూమర్స్‌ వున్నాయి.

రాజమౌళి తదుపరి చిత్రం డి.వి.వి. దానయ్య బ్యానర్‌లో వుంటుందనేది తెలిసిందే. దానయ్యకి బ్యాక్‌ ఎండ్‌లో సపోర్ట్‌ ఇచ్చేది, ఫైనాన్స్‌ అందించేది అల్లు అరవింద్‌ అనేది అందరికీ తెలిసిన విషయమే. దానయ్య సినిమాల్లో హీరో ఎవరుండాలనేది డిసైడ్‌ చేసేది కూడా అల్లు అరవింద్‌ అని చెప్పుకుంటూ వుంటారు.

దానయ్య దగ్గర రాజమౌళి డేట్స్‌ వుండడంతో, అతడికే మలి చిత్రం కమిట్‌ అవడంతో, ఎలాగైనా దీనిని అల్లు అర్జున్‌తో చేయించాలని అరవింద్‌ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు భోగట్టా. అయితే అల్లు వారితో చేయడానికి రాజమౌళి సుముఖంగా లేడట. డైరెక్టుగా చెప్పకపోయినప్పటికీ, మగధీర టైమ్‌లో అల్లు అరవింద్‌తో రాజమౌళికి అభిప్రాయ బేధాలు వచ్చాయి. మళ్లీ మెగా క్యాంప్‌లోకి అతను వెళ్లకపోవడానికి కారణమిదే.

ఇప్పుడు అల్లు అర్జున్‌తో సినిమా అవాయిడ్‌ చేయడానికే తనకి అల్లు అరవింద్‌పై కోపం వున్నట్టు ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో రాజమౌళి చెప్పాడని, అసలు విషయం చెప్పకుండా వంద రోజుల కేంద్రాల విషయంలో జరిగిన అవకతవకలని ఎత్తి చూపించాడని, ఓవరాల్‌గా అతనికి వారితో సినిమా చేయాలని లేదనే సంగతి పోస్ట్‌ చేయడానికే ఇలా చేసాడని ఇండస్ట్రీలో గుసగుసలాడుకుంటున్నారు. బాహుబలి లాంటి ఊహాలోకాన్ని సృష్టించిన దర్శకుడు కనుక ఈమాత్రం తెలివితేటలు ప్రదర్శించడంలో వింత లేదనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు