దాసరి.. ఆ కల తీరకుండానే

దాసరి.. ఆ కల తీరకుండానే

దర్శక రత్న దాసరి నారాయణరావు సినీ రంగంలో దాదాపు రెండు దశాబ్దాల నుంచి అంత యాక్టివ్ గా ఉండట్లేదు. ‘ఒసేయ్ రాములమ్మ’ తర్వాత ఆయన జోరు తగ్గించేశారు. దర్శకుడిగా.. నిర్మాతగా సినిమాలు తగ్గిపోయాయి. చివరగా ఆయన 2014లో ‘ఎర్రబస్సు’ సినిమా తీశారు. దాని తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. ఐతే చివరగా ఓ మహా ప్రాజెక్టును తలకెత్తుకోవాలని కోరుకున్నారు దాసరి. కుదరితే తనే ఆ చిత్రానికి దర్శకత్వం వహించాలని కూడా ఆయన అనుకున్నారు. ఆ సినమా మరేదో కాదు.. మహాభారతం.

రెండేళ్లుగా అందరికీ ‘మహాభారతం’ అనగానే రాజమౌళే గుర్తుకొస్తున్నాడు. ఐతే రాజమౌళి ఆ పని మొదలుపెట్టడానికి ముందే దాసరి ముందడుగు వేశారు. తన టీంతో కలిసి ఆయన స్క్రిప్టు కూడా రెడీ చేయించారు. మహాభారతాన్ని నాలుగు భాగాలుగా తీయాలని అనుకున్నారు దాసరి. గత ఏడాది ఓ వేడుకలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కచ్చితంగా మహాభారత కథను తెరకెక్కిస్తానని ఉత్సాహంగా చెప్పారు. ఇది తనన కలల ప్రాజెక్టు అన్నారు.

కానీ ఆ కల తీరకుండానే వెళ్లిపోయారు. మరోవైపు పవన్ కళ్యాణ్ హీరోగా తన ‘తారక ప్రభు ఫిలిమ్స్’ బేనర్ మీద ఓ సినిమా నిర్మించాలని కూడా దాసరి అనుకున్నారు. రెండేళ్లుగా దీనికి సంబంధించి చర్చలు నడుస్తున్నాయి. కానీ అది కూడా కార్యరూపం దాల్చలేదు. మరోవైపు అనేక సంచలనాలతో తన ఆత్మకథ రాబోతున్నట్లు కూడా చెప్పారు దాసరి. అది పూర్తయిందో లేదో తెలియదు. ఈలోపే ఆయన వెళ్లిపోవడంతో అది ఇక వెలుగులోకి వస్తుందో లేదో తెలియకుండా పోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు